(బొజ్జా దశరథ రామి రెడ్డి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కోట్ల పైన విలువైన ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడానికి టెండర్లను పిలవడానికి ముందే జ్యుడీషియల్ ప్రివ్యూ చేయడానికి ప్రభుత్వం ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఈ వ్యవస్థ జస్టిస్ బి. శివ శంకర రావు ఆధ్వర్యంలో జ్యుడీషియల్ ప్రివ్యూ జరుపుతుంది.
నంద్యాలలో ఏర్పాటు చేయదలచిన వైద్య కళాశాల నిర్మాణం టెండర్ల పై ఏదేని సలహాలు, అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 27, 2021 లోపుగా తెలపాలని జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్ ద్వారా ప్రజలను కోరడమైనది.
ఈ విషయం పై రాయలసీమ సాగునీటి సాధన సమితి సవివరాలతో కూడిన సూచనలు/అభ్యంతరాలను జస్టిస్ శివ శంకర రావు గారికి ఏప్రిల్ 22, 2021 న పంపడమైనది.
ఇందులో ప్రధానంగా కింద పేర్కొన్న విషయాలను పొందుపరచడమైనది.
1. నంద్యాలలో ఏర్పాటు చేయదలచిన ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని తెలపడమైనది.
2. రైతుల సంక్షేమానికి, దేశ ఆహార భద్రతకు కీలకమైన నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిలో వైద్యకళాశాల ఏర్పాటు చేపట్టడానికి అభ్యంతరం తెలపడమైనది.
3. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చరిత్ర, ప్రస్థానం తెలపడమైనది. ఈ పరిశోధనా స్థానం అభివృద్ధి చేసిన అనేక పంటలు వివరాలు, అవి రైతు సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో విత్తన పరిశ్రమ అభివృద్ధికి/ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిన విషయాలను తెలపడమైనది.
4. నంద్యాల పరిశోధనా స్థానం ను వేరొక ప్రాంతానికి మార్చడం వలన పరిశోదనల కొనసాగింపు జరగకపోవడం వలన నూతన విత్తానాల అభివృద్ధికి తీవ్ర విఘాతం జరుగుతుందని తెలపడమైనది.
5. పరిశోధనా స్థానంను ఇంకొక ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే మౌళిక వసతుల కల్పనకు చాలా సంవత్సరాల సమయం పట్టడంతో విత్తన పరిశోధన అభివృద్ధిలో తిరిగి కోలుకోలేని నష్టం జరుగుతుందని తెలపడమైనది.
6. పరిశోధనా స్థానం ను ఇంకొక ప్రదేశంలో ఏర్పాటు చేయాలను కుంటే మౌళిక వసతుల ఏర్పాటుకు, భూమిని పరిశోధనలకు అనుకూలంగా అభివృద్ధి చేసుకొనడానికి అనేక వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా ఇది వాంచనీయం కాదని వివరించడమైనది.
ఇవి కూడా చదవండి
RARS భూముల పరిరక్షణకు నంద్యాలలో భిక్షాటన…
‘చలో నంద్యాల’:115 యేళ్ల ఆధునిక దేవాలయ పరిరక్షణ ఉద్యమం
Killing Farm Research Station to Set Up Medical College Deplorable
7. వైద్య కళాశాల ఏర్పాటుకు నంద్యాల ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న భూములు ఉన్నాయని వివరించడమైనది.
8. నంద్యాల ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు లేవనుకున్నా, పరిశోధనా స్థానం ఇంకొక ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో వైద్య కళాశాలకు అవసరమైన భూములను ప్రభుత్వం కొనుగోలు చేయవచ్చని తెలపడమైనది.
8. తమ ఆస్తులకు విలువ రావడానికి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కు గత పాలకులు పాలుపడ్డారన్న అభియోగంలాగానే, నేడు కొందరి ఆస్తులు విలువ పెంపుకై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాల ఏర్పాటుకు పట్టుపడుతున్నారన్న అభియౌగం కూడా ఈ ప్రాంతంలో ప్రముఖంగా వినిపడుతున్న విషయం కూడా తెలపడమైనది.
10. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాల ఏర్పాటుకు బదాలాయించడానికి వ్యతిరేకంగా హైకోర్టు లో వేసిన కేసులో, గౌరవ హైకోర్టు పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాల బదాలాయింపై స్టే ఇచ్చిన విషయంను తెలుపడమైనది.
11. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే మౌళిక వసతుల ఏర్పాటులో ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఏర్పడిన జ్యుడీషియల్ ప్రివ్యూ సంస్థ అభివృద్ధి చెందిన వ్యవసాయ పరిశోధనా స్థానం ను భూములలో వైద్య కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపి ప్రజల డబ్బును నీటిపాలు చేయవద్దని మనవి చేయడమైనది
(బొజ్జా దశరథ రామి రెడ్డి,అధ్యక్షులు,రాయలసీమ సాగునీటి సాధన సమితి)