లాాక్ డౌన్ చివరి అస్త్రం… మరింత స్పష్టత ఇచ్చిన ప్రధాని మోదీ…

దేశంలో మరొకసారి  లాక్‌డౌన్ విధించే పరిస్థితులు రావొద్దని కోరుకుందామని ప్రధాని మోదీ  పేర్కొన్నారు.

ఈ రాత్రి 8.45కు దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన లాక్  డౌన్ బాధ్యతలను రాష్ట్రలకు అప్పగించారు.గతంలో లాక్ డైన్ ప్రకటించే అధికారం కేంద్రానికి ఉండేది. ఇపుడు దానిని  రాష్ట్రాలమీద పెట్టారు. చివరి అస్త్రంగా మాత్రమే లాక్ డౌన్ ప్రయోగించాలని రాష్ట్రాలకు సూచించారు. అంటేజాతీయ స్థాయిలో లాక్ డౌన్ అనేది ఉండదనే వరకు ప్రధాని స్పష్టత నిచ్చారు.

“I urge states to use lockdown as a last resort. They should try their best to avoid lockdown and focus on micromanagement zones instead.”

కరోనా సెకండ్ వేవ్ ని “కోవిడ్-19″ తుఫాన్ అని వర్ణిస్తూ, ప్రజలు ఎలా సతమతమవుతున్నారో తనకు బాగా తెలుసునని ప్రధాని చెప్పారు.

‘అందరూ సంయమనం పాటిస్తే రెడ్‌జోన్‌లు, కంటైన్ మెంట్ పరిధులు వేసే అవసరం ఏర్పడదు. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాను. ప్రజలందరూ సంఘటితంగా ఒకరికొకరు సహాయ పడాల్సిన సమయం ఇది. ధైర్యంగా ఉండండి. అపుడే కరోనా మనం జయించగలం,” అని చెబుతూ అనవసరం ఆందోళనకు గురికావద్దని ప్రజలకు సూచించారు.

ఎక్కడిక్క ప్రజలు బృందాలుగా ఏర్పడాలని, పుకార్లను వ్యాప్తి చేయవద్దని, మీకు మీరుగా స్థానికంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలని కోరారు.

“I appeal my young friends to form committees in their colonies and apartments to ensure COVID-19 appropriate behavior as this would help state  government avoid establishing containment zones or impose curfews and there would be no question of a lockdown.”

దేశంలో ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు, మేడిన్ ఇండియా రెండు వ్యాక్సిన్ ను సమృద్ధిగా అందుబాటులోకి రాష్ట్రాలతో కలసి కేంద్రం పనిచేస్తూ ఉందని ఆయన వెల్లడించారు.

“వైద్య రంగంతో పాటు ప్రతీ ఫ్రంట్‌లైన్ వారియర్‌కి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వ్యాక్సిన్, రోగ నిరోధక మందులని మరింత వేగంగా ఉత్పాదించాలని ఫార్మా రంగానికి సూచించాం. అవసరమైన సహాయం అందిస్తున్నాం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని,శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరాముడి ఆశీస్సులు‌ మనందరిపై ఉండాలని కోరుకుంటాను!,” అని ప్రధాని  చెప్పారు.