వాక్సిన్ ఉత్పత్తి 700 మిలియన్ డోసులకు పెంచుతున్న భారత్ బయోటెక్

కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ చర్యలు మొదలు పెట్టింది. ఈ కార్యక్రమం చేపట్టేందుకు భారత ప్రభుత్వం  రు. 1500 అడ్బాన్స్ రూపంలో చెల్లించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఒక ప్రకటన విడుదల చేస్తూ వ్యాక్సిన్ తయారీ వార్షిక సామర్థ్యాన్ని 70 కోట్ల డోసులకు పెంచేందుకు చర్యలు మొదలయ్యాయని కంపెనీ తెలిపింది.

కంపెనీలో హైదరాబాద్ తో పాటు బెంగుళూరులో కూడా వ్యాక్సిన్ తయారు చేసే యూనిట్ ఉంది.

The company is able to expand COVAXIN manufacturing capacity in a short time, mainly due to the availability of new specially designed BSL-3 facilities, the first of its kind for manufacturing in India that have been repurposed, and pre-existing expertise and know-how to maintain how to manufacture, test and release highly purified inactivated viral vaccines,” అని కంపెనీ ఈ ప్రకటనలో పేర్కొంది.

ఇదే సమయంలో వ్యాక్సిన్ తయారీలో సిద్ధహస్తులైన భాగస్వాములకోసం కూడా వెదుకుతున్నామని కంపెనీ వెల్లడించింది.

భారతదేశంలో ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ (IIL)తో చేతులుకలుపుతున్నట్లు కూడా కంపెనీ వెల్లడించింది. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ లను వాణిజ్య స్థాయిలో తయారుచేసేందుకు అవసరమయిన సాధన సంపత్తి ఐఐఎల్ దగ్గిర ఉందని భారత్ బయోటెక్ పేర్కొంది.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *