తెలంగాణలో 1498 కొత్త కరోనా కేసులు

 

గత 24 గంటలలో తెలంగాణలో కరోనా కేసులు పెరుగుదల ఆగకుండా పెరుగుతూవచ్చింది. నిన్న 1498 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో జిహెచ్ ఎంసి నుంచే అత్యధికంగా 313 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తర్వాతి స్థానం మేడ్చల్ మల్కాజ్ గిరి ది. ఇక్కడి నుంచి 164 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు సంబంధించి నిజామాబాద్ నుంచి 142 కేసులు, రంగారెడ్డి జిల్ల నుంచి 128 కేసులు నమోదయ్యాయి. ఒక్క వరంగల్ జిల్లా రూరల్ మినహా నిన్న రాష్ట్రంలో ప్రతి జిల్లానుంచి కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిర్మల్ నుంచి 85 కేసు, నల్గొండ నుంచి 45, కరీంనగర్ నుంచి 46, ఖమ్మం నుంచి 35, మంచిర్యాల్ నుంచి 34 కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *