హర్యానా యూనివర్శిటీలో కోవిడ్ కేసుల కుంభకోణం

హర్యానాలో విద్యార్థులు ఆఫ్ లైన్ పరీక్షలు ఎగ్గొట్టేందుకు కొత్త ఎత్తువేశారు. రాష్టంలో ప్రభుత్వ, ప్రయివేటు విశ్వవిద్యాలయాలు ఆఫ్ లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.అంటే, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కాలేజీలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వందలాది మంది విద్యార్థులు దీనికి డుమ్మాగొట్టాలని నిర్నయించుకున్నారు. అంతే, ఫేక్ కోవిడ్ సర్టిఫికేట్లు పుట్టించి, తాము కాలేజీకి వచ్చి పరీక్షలు రాయలేమని, ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించాలని కళాశాలలను అభ్యర్థించారు.ఈ కుంభకోణం మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం (MDU)లో మొదట బయటపడింది. యూనివర్శిటీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అంట్ టెక్నాలజీకి ఇలా 2500 మంది విద్యార్థులు కోవిడ్ మెడికల్ సర్టిఫికెట్లు పుట్టించి పరీక్షలు ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. ఆన్ లైన్ లో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరారు. ఇలా ఒకేసారి పెద్దఎత్తున కోవిడ్ పాజిటివ్ సర్టిఫికేట్లు రావడంతో యూనివర్శిటీ అధికారులు అవాక్కయ్యారు. నిజమైన వైద్య సమస్య ఉంటే పాండెమిక్ దృష్టిలపెట్టుకుని విద్యార్థులను ఆన్ లైన్ పరీక్షలకు అనుమతించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది.దీనిని ఆసరా చేసుకుని వేలాది మంది కోవిడ్ పాజిటివ్ సర్టిఫికేట్లు పుట్టించారు. ఈ సంఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న కోవిడ్ కేసులు సంఖ్యపొంతన లేకుండా పోయింది. అందువల్ల అనుమానంతో ఈ కోవిడ్ పాజిటివ్ సర్టిఫికేట్లను వెరిఫై చేయించారు. దీనికోసం ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ పరిశీంచి, ఈ కోవిడ్ సర్టిఫికేట్లు మొత్తం బోగస్ అని తేల్చింది. ఇందులో చాలా మందిని డిబార్ చేయాలని యూనివర్శిటీ యోచిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *