టిఆర్ ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయ పౌరుడు కాదని కేంద్ర ప్రభుత్వం మరొక సారి స్పష్టం చేసింది. దీనితో ఆయన పౌరసత్వంమీద సాగుతున్నకోర్టు వివాదం ఆసక్తికరమయిన ములుపు తిరిగింది.
రమేష్ ఇంకా జర్మనీ పౌరుడే నని కేంద్ర హోం శాఖ హైదరాబాద్ హైకోర్టుకుతెలియపరిచింది. ఈ మేరకు అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ ఎన్ నాగేశ్వరరావు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.కేంద్ర హమ్ శాఖ అండర్ సెక్రెటరీ అషుతోష్ ఆనంద్ తరఫున ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. జర్మనీలోని భారతీయ దౌత్యకార్యాలయం అందించిన సమాచారం మేరకు ఎమ్మెల్యే రమేష్ ఇంకాజర్మనీ పౌరుడేని హోంశాఖ పేర్కొంది. ఆయన ఇంకా జర్మనీ పౌరుడే అయినందున ఆయనకు వోవర్ సీస్ సిటిజన్ అఫ్ ఇండియా (OCI) హోదా ఇవ్వడం జరిగిందని, అది కేవలం విదేశీభారతీయులకు మాత్రమే ఇస్తారని కేంద్రం స్పష్టం చేసింది. వేములవాడలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనవాస్ టిఆర్ ఎస్ ఎమ్మెల్యే రమేష్ ఎన్నికచెల్లదని, ఆచన భారతీయ పౌరుడు కాదని చెబుతూ ఆయన ఎన్నికలను కొట్టివేయాలని హైకోర్టు కెక్కారు. దీని మీద విచారణ జరుగుతూ ఉంది. ఈ సమయంలో రమేష్ పౌరసత్వం గురించి స్పష్టత ఇవ్వాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించిది. దీనికి స్పందిస్తూ కేంద్కరం జస్టిస్ అహినంద్ కుమార్ షావిలి ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించారు.
ఈకేంద్రం అఫిడవిట్ ఫైల్ చేయడంతో , దీని మీద స్పందించేందుకు రమేష్ న్యాయవాది కొంతగడువు కావాలని కోర్టును కోరారు. కోర్టు ఆయనకు రెండువారాల గడువు ఇచ్చింది.
ఇంతవరకు నడిచిన కథ
టిఆర్ ఎస్ వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తన ద్వంద్వ పౌరసత్వం కేసునుకు సంబంధించి జర్మనీ పౌరసత్వం మీద ఆ దేశం నుంచి సేకరించిన అధికారిక సమాచారాన్ని డిసెంబరు 15, 2020 న అపిడవిట్ దాఖలు చేశారు. ఆయన తాను భారతీయుడినేనే వాదిస్తున్నారు. ఎందుకంటే, భారతీయ పౌరసత్వం తీసుకుంటూనే ఆటోమేటిక్ గా జర్మన్ పౌరసత్వం పోతుందనేది ఆయన వాదన.దీనికి ఆయన జర్మనీ నుంచి కొంత సమాచారం సేకరించి కోర్టు కు సమర్పించారు.
వేములవాడ ఎన్నికల్లో ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేసి రమేష్ పౌరుసత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రమేష్ భారత దేశం పౌరసత్వం చెల్లదని, ఆయన ఇంకా జర్మనీ పౌరుడని చెబుతూ ఆయన ఎన్నికల చెల్లదని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇది రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది.
చెన్నమనేని రమేష్ తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లో ప్రవేశించారు. 2009లో వేముల వాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2010 లో టిఆర్ ఎస్ లో చేరారు. అపుడు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. తర్వాత 2014, 201 8 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. ఆయన దంద్వ పౌరసత్వం కేసు కోర్టు దాకా వచ్చింది.
ఆయన భారత్ ను మోసగించి తనకు జర్మనీ పౌరసత్వం ఉన్నా భారత పౌర సత్వాన్ని మోసపుచ్చి (by playing fraud upon the government) తీసుకున్నాడనేది శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణ. 2008 భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేస్తున్నపుడు తాను స్థిరంగా ఇక్కడ నివసించడంలేదన్న విషయాన్ని కప్పిపుచ్చారని భారత హోం శాఖ కూడా ఆరోపించింది.
రమేష్ కరీం నగర్ జిల్లా కుచెందిన ప్రముఖ కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చారు. 1987లో ఆయన ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లారు. హంబోల్ట్ విశ్వవిద్యాలయంలో డాక్టొరేట్ పూర్తి చేశారు. తర్వాత అక్కడే స్థిరపడ్డారు. 1993లో ఆయన జర్మనీ పౌరసత్వం వచ్చింది.
జర్మనీలో కమ్యూనిజం కూలిపోవడంతో ఆయన మళ్లీ ఇండియా వచ్చారు. ఆయన తండ్రి ప్రఖ్యాత కమ్యూనిస్టు నేత సిహెచ్ రాజేశ్వరరావు సిపిఐ నుంచి బయటకు వచ్చాక టిడిపిలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. రమేష్ ఆయన వారసత్వం తీసుకున్నారు. ఇక్కడే పౌరసత్వం వివాదం వచ్చింది. జర్మనీ పౌరుడిగా ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదు. అపుడు ఆయన భారత పౌరసత్వానికి మార్చి 2008లో దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సమయంలో ఆయన తాను భారత్ లో నివసించకపోయినా నివసిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని హోంశాఖ పేర్కొంది. 2009లో ఎన్నికల్లో గెలిచాక ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఆయన పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ హోంశాఖ కు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇపుడు సాగుతున్న విచారణ దాని పర్యవసానమే.
2013లో హైకోర్టు రమేష్ అసెంబ్లీ ఎన్నికను రద్దు చేసింది. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి కండిషనల్ స్టే తెచ్చుకున్నారు. అంటే సభ్యుడిగా కొనసాగవచ్చు. అయితే, ఓటింగ్ లో పాల్గొనడానికి వీల్లేదు. 2017లో ఆయన భారత పౌరసత్వాన్ని భారత హాం శాఖ ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని రమేష్ వేసిన పిటిషన్ ను 2017 డిసెంబర్ లో హోం శాఖ కొట్టి వేసింది.
హోం శాఖ చెన్నమనేని ద్వంద పౌరసత్వం గురించి జర్మని రాయబార కార్యాలయన్ని సంప్రదించినప్పుడు ఆయన జర్మనీ పౌరుడు కాదని తేల్చింది. పాత పాస్ పోర్టు ఉపయోగించిన మాత్రాన చెన్నమనేని జర్మని పౌరుడు కాడని జర్మనీ చెప్పింది.
పౌరసత్వ చట్టం సెక్షన్ 5 ప్రకారం చెన్నమనేని తను భారత పౌరసత్వం పొందిన సమాచారాన్ని 3.3.2009 నాడు జర్మనీ కి తెలియ చేశారు. ఈ సమాచారాన్ని 13.2.2020 నాడు మరోసారి ధ్రువీకరిస్తున్న పత్రాన్ని 15.12.2020 నాడు అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సమర్పించారు.
1993 లొ చెన్నమనేని స్వచ్చందంగా జర్మని పౌరసత్వం తీసుకున్నప్పుడు భారత పౌరసత్వం ఎలాగయితే కోల్పోవడం జరిగిందో అదేవిధంగా 2009 లొ మళ్ళీ స్వచ్చందంగా భారత పౌరసత్వం తీసుకున్నప్పుడు జర్మనీ పౌరసత్వాన్ని కోల్పోయారని ఆయన తరుఫు వాదిస్తున్నారు.
ఆయన పౌరసత్వం హోదా ఏమిటో స్పష్టత ఇవాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.