ఏప్రిల్‌ 3న ‘జీ 5’లో ‘సీత ఆన్‌ ది రోడ్‌’ ప్రీమియర్‌

వీక్షకులకు వినోదం అందించడంలో ముందుండే ఓటీటీ వేదిక ‘జీ 5’. కరోనా కాలంలో డైరెక్ట్‌–టు–డిజిటల్‌ రిలీజ్‌లు, ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు, పలు చిత్రాలను విడుదల చేయడం ద్వారా తెలుగు ప్రజలకు వినోదం అందించింది. లేటెస్టుగా మరో సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

కల్పికా గణేష్‌, నేసా ఫర్హాది, గాయత్రీ గుప్తా, ఖతేరా హకీమీ, ఉమా లింగయ్య ప్రధాన పాత్రల్లో ప్రణీత్‌ యారోన్‌ దర్శకత్వం వహించిన సినిమా ‘సీత ఆన్‌ ది రోడ్‌’. మార్చి తొలి వారంలో జీప్లెక్స్‌లో విడుదలైంది. ఇప్పుడీ సినిమాను ఏప్రిల్‌ 3న ‘జీ 5’ ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

ఐదుగురు అమ్మాయిలు, జీవితంలో వాళ్లకు ఎదుదైన కఠినమైన పరిస్థితుల నేపథ్యంలో ‘సీత ఆన్‌ ది రోడ్‌’ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా స్త్రీలు సమాజంలో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? ఎన్ని కఠిన పరిస్థితులను తట్టుకొని జీవిస్తున్నారు? వంటి అంశాలను అత్యంత సహజంగా చూపించిన చిత్రమిది. ఐదుగురి నేపథ్యం ఏమిటి? వాళ్లు ఎలా కలిశారనేది ఆసక్తికరమైన అంశం. ప్రధాన పాత్రధారుల నటనకు, స్వరాలు, నేపథ్య సంగీతానికి ప్రశంసలు దక్కాయి. కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే అందించడంతో పాటు చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రణీత్‌ యారోన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న తెలుగు సినిమా ‘జెర్సీ’ సహా పలు విజయవంతమైన చిత్రాలను ‘జీ 5’లో ప్రజలు చూడవచ్చు. లాక్‌డౌన్‌లో పలు వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కొత్తగా ‘నిన్నిలా నిన్నిలా’ను డైరెక్ట్‌–టు–డిజిటల్‌ రిలీజ్‌ చేసింది. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ను ‘జీ 5’ ఓటీటీలో విడుదలైన విషయం విధితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *