తెలంగాణలో 4 జిల్లాలు కరోనా హై రిస్క్

తెలంగాణలో నాలుగు జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 హైరిస్క్ జిల్లాలుగా ప్రకటిచింది. అవి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు అత్యధిక జనసాంద్రత్ వల్ల ఎక్కువ కేసులను చూస్తుంటే, నిజామాబాద్ జిల్లాకు చాలా పొడవైన మహారాష్ట్ర బార్డర్ ఉండటం వల్ల హైరిస్క్ గ్రూపులో చేరింది.

తెలంగాణ జనాభాలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ల జనాభా మూడోంతులుంటుంది.దీనితో కరోనా ఇక్కడ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అయితే, నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర వల్ల ముప్పు వచ్చింది.

మహారాష్ట్రలో కోవిడ్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈజిల్లాకు మహారాష్ట్రతో ఎక్కువ సంబంధాలుండటంవల్ల జిల్లాలో ఎక్కువ కరోనా కేసులు కనబడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.


*తెలంగాణ రాష్ట్రంలో వెయ్యికి చేరువైన కొరొనా కేసులు

*గడిచిన 24 గంటల్లో 965 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు

*5 మరణాలు- 9159 ఆక్టివ్ కేసులు

*జిహెచ్ఎంసి 254, మేడ్చెల్ 110, రంగారెడ్డి 97, నిజామాబాద్ 64, నిర్మల్ 39, జగిత్యాల్ 35 కేసులు

*రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కేసులు నమోదు


తెలంగాణలో రోజుకు 8 నుంచి 10 కరోనా విస్పోటనాలు (outbreaks)కనిపిస్తున్నాయి. అవుట్ బ్రేక్ అంటే ఏదేని ఒకప్రాంతంలో ఒక వ్యక్తి నుంచి 10 నుంచి 25 మందికి కరోనాసోకి పాజిటివ్ గా తేలడం. తెలంగాణ జిల్లాలో ఈ ట్రెండ్ కనిపిస్తూ ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇలాంటి అవుట్ బ్రేక్ ల వల్ల ఒక రోజు ఉనట్లుండి పెద్ద ఎత్తున కేసులు బయటపడతాయి. ఇలాంటి అవుట్ బ్రేక్ భూపాల్ పల్లి, నిర్మల్, జగిత్యాల్ జిల్లాలలో కనిపించింది. అయితే ఇతర జిల్లాలలో కనిపిస్తున్న కరోనా కేవలం స్థానికంగా మాత్రమే ఉంది. దీనికి భిన్నంగా హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అవుట్ బ్రేక్స్ బాగా తీవ్రంగా కనిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే, కోవిడ్ నిర్ధారణకోసం చేయాల్సిన RT-PCR(reverse transcription–polymerase chain reaction) పరీక్షలో తెలంగాణ బాగా వెనకబడి ఉందని కేంద్రం ప్రకటించింది. ఎంత వెనకబడి ఉందంటే,బీహార్ కంటే పరిస్థితి ఇక్కడ అధ్వాన్నంగా ఉంది. ఆర్ టి- పిసిఆర్ పరీక్షల కంటే తెలంగాణ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT)లకే ప్రాముఖ్యం ఇస్తూ ఉంది. దీనితో తెలంగాణలో చేస్తున్న కరోనా పరీక్షలో RT-PCR వాటా కేవలం 15.50 శాతమే. ఇది కేంద్రం ప్రకటించిన రాష్ట్రంలో అట్టడుగున ఉంది. RT-PCR వాటా 70 శాతం ఉండాలని కేంద్రం చెబుతూ ఉంది.  కేంద్రం తాజాగా విడుదలచేసిన కోవిడ్ మార్గ దర్శకసూత్రాలకు ఇది వ్యతిరేకం.

తెలంగాణలో రోజూ 50వేల నుంచి 55వేల పరీక్షలు చేస్తున్నారు. ఇందులో RT-PCR పరీక్షలు పదివేలు కూడా లేవు. ఇది బీహార్ కంటే తక్కువ. బీహార్ ఈ పరీక్షల వాటా 16.35 శాతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *