తెలంగాణ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని ఏప్రిల్ 5న న్యూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన దీక్షను విజయవంతం చేయాలని కాశిబుగ్గ ప్రాంత అఖిల పక్షం పిలుపునిచ్చింది. ఈమేరకు కాశీబుగ్గ అఖిల పక్షం ఆధ్వర్యంలో అధ్వర్యంలో గోడపత్రికలన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా “మా ఉద్యోగాలు మాకే కావాలి, మా కోచ్ ఫ్యాక్టరీ మాకే దక్కాలి” అని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పోరీక ఉదయ్ సింగ్ ,డా.కొణతం కృష్ణ, సోమరామ్మూర్తి,మీసాల ప్రకాశ్ ,గంగుల దయాకర్ ,నలిగంటి చంద్రమౌళి,గోనెల దేవెందర్ !నాగవెల్లి వెంకట స్వామి,జంగం రాజనర్సయ్య ,నల్లెల్ల రాజయ్య,ఇ.రాజేందర్ ,కూచన రవీందర్ ,జన్ను జీవన్ ,చుంచు ఆనందరావు,పెరుమాండ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
గోడ పత్రికల ఆవిష్కరణానంతరం ప్రజా కళాకారుడు పోరీక ఉదయ్ సింగ్ సాంస్కృతిక కార్యక్ర మం నిర్వహించారు. డా.కొణతం కృష్ణ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం, దగాకోరు విధానాల ఫలితంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నంగానే మిగిలిపోతున్నదనీ, ప్రస్తుతం ఈ స్వప్న సాకారానికై తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ తరహాలోనే పార్టీలకతీతంగా రాజకీయపార్టీలు ,ప్రజా సంఘాల సంఘటిత పోరాటాలద్వార కోచ్ ఫ్యాక్టరీ సాధించుకుందామని అన్నారు.
పిసీసికార్యదర్శీ మీసాల ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ విభజన చట్టంలో పదవ షెడ్యూల్లో తెలంగాణకు కోచ్ ఫ్యాక్ఠరీ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ,ములుగులో గిరిజన యూనివర్సిటీ ఇస్తామని కాంగ్రేస్ ప్రభుత్వం హామీ ఇవ్వగా ప్రస్తుత బిజేపీ కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీనీ తుంగలో తొక్కి తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరే అవసరం లేదని ఢంకా బజాయించి చెప్పడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని,
ఏది ఏమైన కేంద్రం మెడలు వంచి కోచ్ ఫ్యాక్టరీ,డివిజన్ సాధించుకుందామని దీనికై జరిగే ఉద్యమాలల్లో నిరుద్యోగ యువత ముందుండాలని ,భవిష్యత్తులో దాని ఫలాలు వారే అనుభవిస్తారన్నారు.
సిపిఐ ఎం.ఎల్ .న్యూడెమోక్రసీ జిల్లాకమిటీ సభ్యులు గంగుల దయాకర్ మాట్లాడుతూ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,డివిజన్ సాధనకై మన తెలంగాణ చిరకాల స్వప్నసాకారానికై ఈ నెల ఐదున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాజీపేట కోచ్ ఫ్యాక్టరి,డివిజన్ సాధన సమితి
అధ్వర్యంలో జరిగే నిరసన దీక్షలో వరంగల్ నుండి రాజకీయ పార్టీల ప్రతినిధులు ,ప్రజా సంఘాల ,ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ,కార్మిక కర్షక సంఘాల ,అసంఘటిత కార్మిక సంఘాల ,విద్యార్ధి యువజన సంఘాల ప్రతినిధులు మరియు రచయితలు,కవులు,కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంచేయాలని విజ్ఞప్తిచేశారు.