కోమటిరెడ్డి నిరసన పాలాభిషేకం

తెలంగాణలోఏదో హామీ ఇచ్చినపుడో,హామీ నెరవర్చినపుడో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేస్తుంటారు. ఇది ఆనందం పట్టలేక, ఉబ్బితబ్బిబ్బయిపోయే చేసే పాలభిషేకం. అయితే, భవనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు మంత్రి హరీష్ రావ్ వేసిన ఒక శిలఫలకానికి పాలాభిషేకం చేశారు. ఆనందం పట్టలేక, ఉబ్బితబ్బిబ్బయి చేసిన పాలభిషేకం కాదు. కడపు మండి, ఆగ్రహంతో, నిరసన వ్యక్తం చేసేందుకు చేసిన పాలాభిషేకం. అసలు విషయం ఏందంటే….

హ‌య‌త్ న‌గ‌ర్ మండ‌లంలో జాతీయ ర‌హ‌దారి-9 నుంచి బ‌లిజ‌గూడ వ‌రకు ఒక రోడ్డు వేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక ఈ కలనెరవేరుస్తామని టిఆర్ ఎస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆరేళ్ల క్రితం శంఖుస్థాప‌న రోడ్డుకు శంకుస్థాపన చేసింది. అయితే ఇప్పటిదాకా నిధులు విడుద‌ల చేయలేదు. ఇది అన్యాయమని నిర‌సిస్తూ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిలాఫ‌లాకానికి పాలాభిషేకం చేశారు.

10.08.2015న అప్ప‌టీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావు, మ‌హేంద‌ర్ రెడ్డిలు రూ. 11కోట్ల‌తో జాతీయ‌ర‌హ‌దారి-9 నుంచి దేశ్‌ముఖ్ వ‌యా బ‌లిజ‌గూడ, క‌వాడిప‌ల్లి మీదుగా బీటీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాప‌న చేసిన‌ట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఇప్ప‌టికీ ఆరేళ్లు గ‌డుస్తున్న నిధులు ఎందుకు విడుద‌ల చేయాలేదు, టెండ‌ర్లు ఎందుకు పిలువ‌లేద‌ అని ఆయన ప్రశ్నించారు.

త్వ‌ర‌గా మంత్రులు,అధికార యంత్రాంగం స్పందించి ఈ రోడ్డు విషయంలో ప్రజలను మోసం చేసినందుకు బహిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఎంపి డిమాండ్ చేశారు. ఈ ప‌నుల‌ను త్వ‌ర‌గా ప్రారంభించ‌కుంటే మీరు శంఖుస్ధాప‌న చేసి మోసం చేసిన గ్రామ‌స్థుల‌తో క‌లిసి జాతీయ‌ర‌హ‌దారిని దిగ్భందిస్తామ‌ని ఆయన హెచ్చరించారు.

త‌న సొంత జిల్లాకు వంద‌ల కోట్లు ఇస్తున్న కేసీఆర్, ఇబ్ర‌హీప‌ట్నం నియోజ‌క వ‌ర్గంలో ఆరేళ్లుగా బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 11కోట్లు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌ కాదా అని కోమటి రెడ్డి అన్నారు.

సీఎం కుటుంబ స‌భ్యులు, మంత్రులు చేసిన శంఖుస్థాప‌న‌ల‌కే దిక్కులేకుంటే ఒక ఎమ్మెల్యే ప‌రిస్థితి ఏమిటని వారు విమర్శించారు. ఉద్యోగులు వారి హ‌క్కులు వారు సాధించుకుంటే పాలాభిషేకాలు చేయించుకునే టీఆర్ఎస్ స‌ర్కార్‌కు , ప‌నులు చేయ‌క‌పోవ‌డం, హామీలతో ప్ర‌జ‌ల‌ను మోసం చేయడం రివాజు అయిందని, దీనికి నిర‌స‌న‌గా శంఖుస్థాప‌న శిలాఫ‌ల‌కానికి పాలాభిషేకం చేస్తున్న‌ట్లు ఆయన తెలిపారు. ఈ పాలాభిషేకంతోనైనా కేసీఆర్ స‌ర్కార్‌కు క‌నువిప్పు క‌ల‌గాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *