ఇ-గోల్కొండ తెలంగాణ షాపింగ్ పోర్టల్ ప్రారంభం

తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ – గోల్కొండ ప్లాట్ ఫాం ను టెక్స్ట్ టైల్ శాఖ మంత్రి కే.తారకరామారావు ఈ రోజు ప్రగతి భవన్లో ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన ఈ -గోల్కొండ ద్వారా సాంప్రదాయ కళాకృతులను, చేతి బొమ్మలను కొనుగోలు చేసే వీలు ఉంటుంది.

ఈ పోర్టల్ ద్వారా తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న అనేక అద్భుతమైన ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి ఈ-మార్కెట్ ప్లేస్ ని తయారుచేయడమే లక్ష్యంగా ఈ పోర్టల్ రూపొందించారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న అనేక ప్రైవేట్ ఈ- కామర్స్ వెబ్ సైట్ల కంటే అత్యుత్తమంగా ఈ వెబ్ పోర్టల్ లో సౌకర్యాలను రూపొందించారు.

ఈ వెబ్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళాకృతులను చేర్చేందుకు వీలుందని, త్వరలోనే అవసరమైన కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత, ప్రపంచంలో ఎక్కడికైనా తమ కళాకృతులను పంపే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్బంగా మాట్లాడుతూ కెటి ఆర్ అన్నారు.

ఈ- గోల్కొండ ద్వారా అమ్మకానికి ఉంచిన ప్రతి కళా కృతిని సునిశితంగా పరిశీలించేందుకు అవసరమైన 3డి సౌకర్యాన్ని సైతం అందుబాటులో ఉంచారు. ఈ వెబ్సైట్ మొబైల్ ఫోన్ లకు సరిపడే విధంగా రూపొందించారు.
ఈ ఈ-గోల్కొండ ఫ్లాట్ఫామ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తయారవుతున్న హ్యాండీక్రాఫ్ట్, ఇతర అద్భుతమైన కళాకృతులకు ప్రపంచానికి పరిచయం చేవచ్చని చెబుతూ https://golkondashop.telangana.gov.in/ లింకు ద్వారా తమకు నచ్చిన కళాకృతులను ప్రజలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *