చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాలో తీవ్రంగా కరోనాకేసు
ఆంధ్రప్రదేశ్ లో కరోనాకేసులు పెరుగుదల కొనసాగుతూ ఉంది. గత 24 గంటల్లో 31,809 మందికి పరీక్షలు జరుపగా 1271 పాజిటివ్ కేసులు కనిపించాయి.
కోవిడ్ వల్ల అనంతపూర్, గుంటూరు, విశాఖ పట్టణం జిల్లలలో ఒక్కొక్కరు మరణించారు. చిత్తూరు, గుంటూరు, విశాఖ పట్టణం, కృష్ణా జిల్లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
చిత్తూరుజిల్లాలో 285 కేసులు కనిపిస్తే, గుంటూరు జిల్లాలో 279 కేసులు కనిపించాయి.విశాఖ పట్టణం జిల్లా 189 కేసులతో మూడోస్థానంలో ఉంది. ఇక కృష్ణ జిల్లాలో 161 కేసులతో నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 8142 యాక్టివ్ కేసులున్నాయి. ఇంతవరకు ఆంధ్రలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 7220.