గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లి ఆ యన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాడేపల్లి నుంచి నేరుగా గుంటూరులోని భారత్‌పేట 6వ లైన్, 140 వార్డు సచివాలయానికి చేరుకున్న తొలుత కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుంది. సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల సహకారంతో కచ్చితమైన సమాచారం పొందుతూ, రాష్ట్ర స్ధాయిలో వ్యాక్సినేషన్ పురోగతిని పర్యవేక్షించేలా ఈ యాప్‌ను రూపొందించారు.
కోవిడ్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను కూడా ఆయన తిలకించారు.
ఆ తర్వాత భార్య వైయస్ భారతితో సహా, వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నారు.
కాసేపు వైద్యుల అబ్జర్వేషన్లో ఉన్న ఆయన, ఆ తర్వాత సచివాలయం, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు.