‘వైల్డ్ డాగ్’ కి U / A సర్టిఫికేట్

కింగ్ నాగార్జున వరుసగా కొన్ని ఫ్లాప్స్ తర్వాత, ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా వైల్డ్ డాగ్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఏప్రెల్ 2 ప్రాంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కాగా తాజా అప్డేట్ ప్రకారం, ఈ రోజు సెన్సారైన ఈ మూవీకి యూ / ఎ‘ సర్టిఫికేట్ లభించింది. మరో వైపు విడుదలని పురస్కరించుకుని వైల్డ్ డాగ్ బృందం మొత్తం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా వుంది.

ఇది టెర్రరిజం మీద తీసిన మూవీ. 2007 నుంచి  2013 వరకు దేశంలో జరిగిన బాంబు పేలుళ్ల ఆధారంగా ఈ కథ వుంటుంది. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ జంట పేలుళ్లు కూడా ఈ కథలో భాగంగా వుంటాయి. మన్మధుడు 2’ ఫేమ్ కింగ్ నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కమ్ ఎన్‌ఐఏఏజెంట్  విజయ్ వర్మ పాత్ర పోషించాడు. బాలీవుడ్ నటి దియా మీర్జా ఇందులో ప్రముఖ పాత్ర పోషించింది. అహిషర్ సాల్మన్ దర్శకుడు.

మరో  బాలీవుడ్ నటి సయామి ఖేర్ రా  ఏజెంట్‌గా నటించింది. ఈ పాత్రని పోషించడానికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందింది. ఇంకా బాలీవుడ్ నటులు అతుల్ కులకర్ణిఅలీ రెజా కీలక పాత్రలు పోషించారువైల్డ్ డాగ్ కి  యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ డేవిడ్ ఇస్మలోన్. ఇతను ఏ మ్యాన్ విల్ రైజ్ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7, వంటి అంతర్జాతీయ సినిమాలకి  పనిచేసిన యాక్షన్ డైరెక్టర్.

ఇలా వుండగా, నాగార్జున డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ గోవాలో పూర్తయింది.  నాగ్ చెల్లెలిగా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌మేనకోడలి పాత్రలో మలయాళీ నటి అనిఖ నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *