ఏకైక పానిండియా స్టార్ అతనే!

 

దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ వున్న ఏకైక పానిండియా స్టార్ ఎవరంటే ప్రభాస్. నిజానికి 2019 లో ‘సాహో’ తర్వాత మరో సినిమా విడుదల కాకపోయినా, వరసగా నాలుగు పానిండియా సినిమాలో భారీ బడ్జెట్ లతో ప్రారంభమైపోయాయి. ఇక్కడితో ఆగడం లేదు, ప్రభాస్ తో పానిండియా సినిమాలు తీసేందుకు మరికొందరు నిర్మాతలు ఎగబడుతున్నారు. భారతదేశం అంతటా, ఇంకా విదేశాల్లో  ‘బాహుబలి’ తో సాటిలేని పాపులారిటీని సాధించిన నేపథ్యంలో, ప్రభాస్ కి పాన్-ఇండియా మూవీస్ కి ఆఫర్లు వరుసగా వచ్చేశాయి. రాధేశ్యామ్, సాలార్, ఆది పురుష్…ఇంకా పేరు పెట్టని నాగ్ అశ్విన్ మూవీ ఈ నాల్గూ బ్యాక్ టు బ్యాక్ గా ప్రకటించిన ఏకైక పాన్ఇండియా స్టార్ గా ప్రభాస్ సంచలనానికి మారు పేరు అయ్యాడు.
మైథాలజీ, రొమాంటిక్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ కథాంశాలతో డిఫరెంట్ మెగా మూవీస్ చేస్తున్నాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ నాలుగూ  సినిమాలూ లాక్ డౌన్ సమయంలో ప్రకటించినవే. కోవిడ్ సంక్షోభంతో భవిష్యత్తు గురించి ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియని సమయంలో, ప్రభాస్ నాలుగు  పానిండియా సినిమాలు సైన్ చేయడం సంచలనమే సృష్టించింది. పాన్-ఇండియన్ ప్రేక్షకుల కోసం, అంటే మాస్ అండ్ క్లాస్, ఈస్ట్ అండ్ వెస్ట్, సౌత్ అండ్ నార్త్ చుట్టేస్తూ అతడి వెలిగిపోతోంది. దక్షిణాది స్టార్స్ చిరంజీవి,  కమల్ హాసన్, మమ్ముట్టి, ఆఖరికి రజనీ కాంత్ సైతం సాధించలేనిది ప్రభాస్ ఏకబిగిన  సాధించేస్తున్నాడు. ప్రభాస్ ఇకపై తెలుగు మాట్లాడే మార్కెట్ కోసమే సినిమాలు చేస్తాడనేది లేకుండా పోయింది.
కల్చర్ లో వచ్చిన మార్పు ప్రభాస్ కి కలిసి వస్తోంది. మునుపటి హిందీ హీరోలు హిందీ బాలీవుడ్ ని జయించడానికి,  అక్కడి నేటివిటీతో మసాలా సినిమాలు చేసేవారు. ఆ సినిమాలే దేశవ్యాప్తంగా ఆడేవి. కానీ గ్లోబల్ గా సినిమాలు ప్రక్షకుల చేతికొచ్చాక నేటివిటీకి అంతగా ప్రాధాన్యమే లేకుండా పోయింది. ఇంకెంత మాత్రం సౌత్ హీరోలని హిందీ వాళ్ళు ‘మద్రాసీ యాక్టర్’ అనే చిన్న చూపు చూసే అవకాశం లేకుండాపోయింది. దీన్ని ‘బాహుబలి’ వచ్చిన పేరుతో క్యాష్ చేసుకుంటున్నాడు ప్రభాస్. ఇప్పుడు తను దక్షిణాది నుంచి  వచ్చిన మొదటి నిజమైన పాన్-ఇండియన్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు.
ప్రభాస్ తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడే హిందీ ప్రేక్షకులు పరిచయమయ్యారు. ఎలాగంటే అతడి తెలుగు సినిమాల డబ్బింగ్ వెర్షన్లు టీవీల్లో బాగా పాపులర్ అయ్యాయి. ఇక ‘బాహుబలి’ నేరుగా స్టార్ ని చేసింది.
బాలీవుడ్ నటులు ప్రభాస్ నుంచి  నేర్చుకోవాల్సింది వుంది. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్ లాంటి ఓ ఇద్దర్ని మినహాయిస్తే, ఇతర హిందీ స్టార్లు ఒక్కో సినిమా ఓకే చేసి సైన్ చేయడానికి చాలా కాలం తీసుకుంటారు. ప్రభాస్ సూపర్ స్పీడుతో సినిమాలు చేసి వాళ్ళ చాప కిందికి నీళ్ళు తెచ్చేట్టు వున్నాడు. బాలీవుడ్ స్టార్స్ లా కాక, ప్రభాస్ మల్టీ ప్లేక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు, బిసి సెంటర్లలో కూడా దూసుకుపోయే సినిమాలతో వచ్చేస్తున్నాడు. సౌత్ హీరోలు బాలీవుడ్ ని జయించడానికి విఫల యత్నాలు చేశారు. ప్రభాస్ పానిండియా సినిమాలతో బాలీవుడ్ ని కూడా జయించేస్తున్నాడు. అతను నటిస్తున్న 4 సినిమాల బడ్జెట్ 700 కోట్లు!

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *