టిఆర్ ఎస్ కొత్త ఎమ్మెల్సీ వాణీదేవి కరోనా పాజిటివ్

టిఆర్ ఎస్ కొత్త ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె యే స్వయంగా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కొద్ది రోజులుగా తనతో కలసి తిరిగిన వారం కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని, హోం క్వారంటైన్ కావాలని కోరారు.

గత వారంలో జరిగిన గ్రాజుయేట్ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్సెల్సీగా ఎన్నికయ్యారు. మంచి మెజారిటీ తెచ్చుకున్నందున ఆమెను తొందర్లో  కౌన్సిల్ ఛెయిర్ పర్సన్ చేసే అవకాశం ఉందనే వూహాగానాలు కూడా వినబడుతున్నాయి. ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి జూన్ లో రిటైరవుతున్నారు. అపుడు విద్యావంతురాలైన వాణీదేవీని ఛైర్ పర్సన్ చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ యోచిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఆమె కౌన్సిల్ కు తొలి మహిళా అధ్యక్షురాలవుతారు. అసెంబ్లీకి మహిళ స్పీకర్ అయ్యారు. ప్రతిభారతిని స్పీకర్ ను చేసి తొలి మహిళా స్పీకర్ ను నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.

ఇపుడు కౌన్సిల్ కు ఆమె ఛైర్ పర్సన్ అయితే, ఎగువ సభకు మహిళా నాయకత్వం కల్పించిన కీర్తి టిఆర్ఎస్ కు దక్కుతుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *