1300 యేళ్ల నాటి హోటెల్ ఇదే… వోనర్ ఒకే కుటుంబం

ప్రపంచంలో  1300 వందల సంవత్సరాలుగా ఇదే ప్రదేశంలో నడుస్తున్న హోటల్ ఇదే. ఇది జపాన్ లోని యమనాషిజిల్లాలో ఉంది. వేన్నీళ్లుబుగ్గ తో ఉన్న ఈ హోటల్ పేరు నిషియామా ఒన్సన్ కెయుంకాన్ (Nishiyama Onsen Keiunkan). ఈ హోటెల్ ను  క్రీశ 705 లో ఏర్పాటు చేశారు.   అంటే 1316 సంవత్సరాల కిందట ప్రారంభమయింది. అప్పటినుంచి మూతపడకుండా నడుస్తున్న హోటెల్ ఇది. మరొక విశేషమేమిటంటే అప్పటినుంచి ఇప్పటి దాకా దీని యజమాన్యం కూడా ఒకే కుటుంబం చేతిలో ఉంది. ఇపుడున్న యాజమాన్యం ఆ కుటుంబానికి చెందిన 52 తరం వారసులు. 2011 లో ఇది ప్రపపంచంలోని అతిపురాతనమయిన హోటెల్ గా గిన్నెస్ రికార్డు సంపాదించింది. హోటెల్ కు సరఫరా అవుతున్న వేడి నీళ్లున్ని హాకుహో బుగ్గలనుంచే వస్తుంటాయి. అన్ని స్నానాల గదులకు సహజసిద్ధమయిన వేడినీటిని సరఫరా చేయడం ఈ హెటెల్ గొప్పదనంగా చెప్పుకుంటూ ఉంటుంది.

అవుట్ డోర్ హాట్ స్ప్రింగ్ గది

కట్టినప్పటి నుంచి అనేక సార్లు మార్పులు చేర్పులకు లోనై ఇపుడున్న ఆకారం తీసుకుంది. 1997 లో హెటెల్ బాగా ఆధునికీకరించారు. అయితే, హెటెల్ సాంప్రదాయిక వాస్తు రీతి (washitsu style) లో మాత్రం మార్పులు తీసుకురాలేదు. అన్ని రూములకు ఫ్రీ, పాస్ వర్డ్ లేని వైఫై సౌకర్యం ఉంటుంది.

అకాయిషీ పర్వత శిఖరాగ్రాన ఉన్న ఈ హోటెల్ లో  37 రూములున్నాయి. ఇది ఫుజి పర్వతాలకు  87 కిమీ దూరాన ఉంటుంది. జపనీయులు పవిత్ర పర్వతంగా భావించే ఫుజి పర్వతాన్ని హోటెల్ రూమ్ లలో నుంచి చూడవచ్చు. హోటెల్ లోని చంద్రదర్శన వేదిక కూడా చాలా పాపులరే.ఇందులో రకరకాల గదులున్నాయి. ఇన్ డోర్ హాట్ స్ప్రింగ్ రూములున్నాయి. అవుట్ డోన్ హాట్ స్ప్రింగ్ రూమూలూ ఉన్నాయి.

రూమ్ టారిఫ్ పెద్దగా లేదు, ఒక రాత్రికి  రు. 27 వేల నుంచి మొదలవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *