తిరుపతిలో కరోనా కలకలం: మునిసిపల్ కమిషనర్

 

తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.ప్రతిరోజూ దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,తిరుపతి మున్సిపల్ పరిధిలో 552 కేసులు,తిరుపతి రూరల్ పరిధిలో 124,మొత్తం 736 కేసులని,
చిత్తూరు మదనపల్లి పరిధిలో 60 కేసులు రావడం జరిగిందని,వీరందరినీ గుర్తించి 268 మందిని హోమ్ ఐసులేషన్లో పెట్టడం జరిగిందని,91 మంది వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని,190 డిశ్చార్జ్ కావడం జరిగిందని,2802 మందిని ప్రైమరీ కాంటాక్ట్ లుగా గుర్తించామని,5395
సెకండరీ కాంటాక్ట్ లుగా గుర్తించామని,హెల్త్ సెక్రటరీలు,ఆశావర్కర్ల ద్వారా హోమ్ ఐసులేషన్లో ఉన్న వారికి తగు సూచనలు,సలహాలు ఇవ్వాలని సూచించామని తెలిపారు.

ప్రజలందరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని,దీని వలన 95 శాతం కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని,ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందని,వాటితో పాటు మూడు స్లోగన్లు విడుదల చేసింది.
1.మాస్కు సరిగా పెట్టు కరోనా ఆట కట్టు
2.ఆరు అడుగుల దూరం కరోనా మీకు దూరం
3.చేతులు శుభ్రం ఆరోగ్యం భద్రం,మన ఆరోగ్యం చేతుల్లో..
వీటిపై విస్తృతంగా ప్రచారం చేయనున్నామని,మాస్కు లేని వారికి వారం రోజుల్లో 60 వేలు జరిమానా విధించామని,ఈ నిబంధనలు తరచూ ఉల్లంఘించే షాపులను కూడా సీజ్ చేస్తామని తెలిపారు.

సెకండ్ వేవ్ ప్రారంభమయింది కాబట్టి లాక్ డౌన్ కి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,అందరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
నగరంలోని వివిధ అసోసియేషన్ వారితో మాట్లాడానని కోవిడ్ పై సహకరించాలని తెలిపామన్నారు.

వ్యాక్సినేషన్ కు సంభందించి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 9 ప్రదేశాల్లో ఉన్నాయని.
1.అర్బన్ హెల్త్ సెంటర్ బైరాగి పట్టెడ, మీసేవ వద్ద.
2.అర్బన్ హెల్త్ సెంటర్ స్కాన్జర్స్ కాలనీ, లీలామహల్ రోడ్డు.
3. అర్బన్ హెల్త్ సెంటర్ స్విమ్స్ సర్కిల్, నెహ్రూ నగర్.
4. అర్బన్ హెల్త్ సెంటర్ పోస్టల్ కాలనీ, వాటర్ ట్యాంక్ దగ్గర, రేణిగుంట రోడ్డు.
5. అర్బన్ హెల్త్ సెంటర్ ఆటోనగర్, రేణిగుంట రోడ్డు.
6. అర్బన్ హెల్త్ సెంటర్ శివ జ్యోతి నగర్, అంబేద్కర్ విగ్రహం దగ్గర జీవకోన.
7. అర్బన్ హెల్త్ సెంటర్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ప్రకాశం రోడ్.
8. మున్సిపల్ హెల్త్ సెంటర్ ప్రకాశం రోడ్, తిరుపతి.
9. అర్బన్ హెల్త్ సెంటర్ ఎర్ర మిట్ట, లీల మహల్ రోడ్డు, తిరుపతి.

నగరంలో 45 సంవత్సరాల పైబడిన వారు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని,నగరంలో ఉన్న 60 ఏళ్ళు పైబడిన 24000 మందిని వ్యాక్సినేషన్ వేసుకోవాలని కోరుచున్నామని తెలిపారు.

వ్యాక్సినేషన్ గురించి ఎవరూ అపోహలు గురికావద్దని తెలిపారు.తిరుపతి లో ఇప్పటివరకు 30771 మందికి వ్యాక్సినేషన్ వేశామని,ఎవరికీ ఎటువంటి ఇన్సిడెంట్ లు జరగలేదని తెలిపారు. అందరూ వ్యాక్సినేషన్ మొదటి రెండవ దోసు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నగరంలో వివిధ ప్రయివేట్ హాస్పిటల్లో 250 రూపాయలకు వ్యాక్సినేషన్ వేస్తున్నారని,ఇవే కాకుండా పీహెచ్సీ లో ఉచితంగా రోజుకు 200 మందికి వేస్తున్నారని తెలిపారు..

ఎవరికయినా కోవిడ్ లక్షణాలు ఉంటే వాలంటీర్ దృష్టికి తీసుకెళితే వెంటనే ఇంటివద్దకే వచ్చి టెస్టులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 700 కేసులు ఉంటే ముగ్గురు మాత్రమే మరణించారని,ఈ మూడు మరణాలు 70 సంవత్సరాలు పైబడిన వారికే సంభవించిందని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *