ఈ నెల 15 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ,శాసన పరిషత్ బడ్జెట్ సమావేశాలు నేటి తో ముగిశాయి.9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.
పద్దుల పై శాసన మండలి లో చర్చించే ఆనవాయితీ లేక పోవడం తో 5 రోజులే నడిచింది.
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో సమావేశాల ప్రారంభం నుంచి నేటి వరకు కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో ఉభయ సభలు జరిగాయి.
గవర్నర్ ప్రసంగం తో మొదలైన సమావేశాలు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తో ఇవాళ్టి తో ముగిశాయి.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కు ఘనంగా నివాళుర్పించింది.
తెలంగాణ అభివృద్ధికి దోహదం చేసే భారీ బడ్జెట్ ను సభలు ఆమోదించాయి.
ప్రశ్నోత్తరాలు,జీరో అవర్ సాఫీగా జరిగాయి.
సభ్యులందరికీ స్పీకర్ ఉదారంగా అవకాశాలిచ్చారు.
పద్దులన్నిటి పై సమగ్రంగా చర్చ జరిగింది.ఎలాంటి చర్చ లేకుండానే గిలిటెన్ అయ్యే రోజులు పోయాయి.మైక్ ఇవ్వకుంటే ప్రతిపక్ష సభ్యులు పొడియంలోకి వెళ్లి నిరసనల హోరు లేదు.ప్రతిపక్ష సభ్యులకు వారి సంఖ్యా బలానికి మించి వారు అడిగినంత సమయం మైక్ లభించింది.
సభలో ఉద్యోగుల పీఆర్ సీ,రిటైర్మెంట్ వయసు పెంపు ,ఇతర ప్రయోజనాల వర్తింపు పై గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేశారు
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల మూసివేత పై విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు.
నాలుగు బిల్లులకు సభ ఆమోదం:
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు బిల్లు ,మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీల వేతన సవరణ బిల్లు ఆమోదం పొందాయి.