ఈ రోజు విడుదలైన నితిన్ కీర్తీ – సురేష్ ల ‘రంగ్ దే’ జస్ట్ ఓకే అన్పించుకుంది. దర్శకుడు అట్లూరి వెంకీ మళ్ళీ రోటీన్ లవ్ స్టోరీనే తీశాడు. ‘నువ్వే కావాలి’ నుంచి ఇలాటి ప్రేమ సినిమాలు లెక్కలేనన్ని వచ్చాయి. లవర్స్ కీచులాడుకోవడం, పెళ్లి చేసుకుని మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం వంటి త రొటీనే ఇందులో మళ్ళీ చూపించారు. అక్కడక్కడా కామెడీ సీన్లు మాత్రం వరలో ఎంటర్టయిన్ చేస్తాయి. ఫస్టాఫ్ లో లవర్స్ గా టైమ్ పాస్ చేసినా, సెకండాఫ్ సీరియస్ గా మారిపోయి తగువులకి ఒక లాజిక్, ఒక అర్ధం, ఒక క్రమం లేకుండా, ఎలాగో క్లయిమాక్స్ కి చేరాక కాస్త నిలబడుతుంది మూవీ. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ పాటలు రిలీఫ్ నిస్తాయి. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం కట్టి పడేస్తుంది. హీరో హీరోయిన్ల కాస్ట్యూమ్స్, కలర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ వంటి ప్రొడక్షన్ విలువలు ఆకర్షిస్తాయి. ఎంతైనా తెలుగు ప్రేక్షకులు చూసిందే చూసేందుకు అలవాటు పడ్డారు కాబట్టి ఈ మూవీ జస్ట్ ఓకే మూవీ.