తెలుగు మంత్రుల జీతాలకు ఇన్ కమ్ టాక్స్ ఎవరు కడుతున్నారో తెలుసా?

సాధారణంగా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునే వాళ్లు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే జీతం వ్యక్తి గత ఆదాయం కాబట్టి, వ్యక్తి గత ఆదాయం కాని జీతమేదీ ఉండదు. అందువల్ల తీసుకున్న జీతానికి ఆదాయపు పన్ను కట్టాలి. ఇలా కోట్లాది మంత్రి జీతాలు తీసుకుంటూ భారమయిన ఆదాయపు పన్ను కడుగుతున్నారు.

అయితే,  ప్రభుత్వం నుంచి వ్యక్తిగత  జీతాలు తీసుకుంటూ దాని మీద ఇన్ కమ్ టాక్స్ ను కూడా ప్రభుత్వం చేత కట్టించే భాగ్యవంతులు కొందరున్నారు. వాళ్లు జీతాన్నింటి ఇంటికి తీసుకువెళ్తారు. టాక్స్ ను మళ్లీ ప్రభుత్వం మీద వేస్తారు. అంటే, వీళ్ల టాక్స్ ని కూడా ప్రజలే భరిస్తున్నారు. పోనీ వీళ్లెవరయిన టాక్స్ కట్టలేనంత  పేదరికంలో ఉన్నారా అంటే  అదీకాదు, వీళ్ల ఎక్కువ మంది కోట్లకు పడగలెత్తిన వాళ్లే. వీళ్లెవరో తెలుసా. తెలుగు ముఖ్యమంత్రులు, మంత్రులు.

ఇంతకంటే అన్యాయమేముంటుంది?

దీని మీద ఆసక్తికరమయిన కథనం ఒకటి ది ఫెడరల్ (The Federal) లో వచ్చింది. ఇదొక ఆసక్తి కరమయిన, నైతిక విలువలకు సంబంధించిన చర్చకు తావిచ్చింది.

తాజాగా  జీతం మీద  కట్టాల్సిన ఆదాయపుపన్నుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఖజానా నుంచే కట్టించారు. ఆయన ప్రభుత్వం నుంచి తీసుకునే జీతంలో టాక్సబుల్ ఇన్ కానికి  ఆదాయపు పన్ను రు. రు, 7,14,924 టాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ మొత్తాన్ని కూడా ఆయన తన జీతం నుంచి కట్ట లేదు. ఖజానా నుంచి చెల్లించారు. దీనికోసం  మార్చి 18న ఒక జివో విడదలు చేశారు.

ఇదే విధంగా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కట్టాల్సిన రు. 2,91,096 లను ఇన్ కంటాక్స్ కు కట్టేందుకు ఈ జీవొ అనుమతినిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామికి రు.209,976,  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు కు రు. 2,09,976, వెనకబడిన తరగతుల శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ రు.95,080,  మరొక   ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ కు రు. 62,868 లను ఆదాయపు పన్నుకింద ప్రభుత్వమే చెల్లించింది.

ఇది ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలోనూ ఉంది. దీనికోసం ఎపుడూ 1953లో తెచ్చుకున్న చట్టాన్ని వాడుకుంటున్నారు. తాము తీసుకున్న జీతానికి ప్రజలనుంచి టాక్స్ కట్టించడం తెలుగు రాష్ట్రాలలో  జోరుగా సాగుతుంది.

మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ మంత్రి ఈటెల రాజేందర్  ఆదాయపు పన్ను చెల్లించేందుకు రు. 2,16,938 లను ఫిబ్రవరి 23న విడుదల చేసింది.

కెటి రామారావు కూడా ఇలాగే తన ఆదాయానికి ఇన్ కం టాక్స్  ప్రభుత్వం చేత కట్టించారు. ఆయన ఇన్ కంటాక్స్ కింద  పరిశ్రమల శాఖ రు. 1,66,670 లను ఫిబ్రవరి 24న విడుదల చేసింది.

వ్యవసాయమంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి ఆదాయపు పన్నును వ్యవసాయ కట్టింది.  దీనికోసం  జనవరి 29న  వ్యవసాయ శాఖ రు. 87,984 లను విడుదల చేసింది.

నిజానికి  1953 పేమెంట్స్ అండ్ శాలరీస్ చట్టం (Payment of Salaries and Pensions and Removal of Disqualification Act 1953)  సెక్షన్ 3 క్లాజ్ 4 కింద ముఖ్యమంత్రుల, మంత్రుల  ఆదాయపు పన్నును ప్రభుత్వం చెల్లించాలి.

అయితే, ఈ చట్టం తయారయినపుడు వాళ్ల జీతాలు చాలా తక్కువ. నిజానికి ఆ రోజుల్లో చాలా మంది ప్రజాప్రతినిధులు పేదవాళ్లుగానే ఉండేవారు. ఇంకా గాంధీయిన్ విలువులుండేవి. ఉదాహరణకు దామోదరం సంజీవరెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చినపుడు విచారణకోసం పెద్ద మనుషులు కర్నూలు సమీపంలో పెద్ద పాడుగ్రామానికి వచ్చారు. అపుడు గుడిసెలో కట్టెల పొయ్యితో వంటచేస్తూ పొగలో కళ్లు మండుతూ నీళ్లు కారుతూ  తంటాలు పడుతున్న సంజీవయ్య తల్లి చూసి, ఇక విచారించాల్సిన అవసరం లేదని వెళ్లిపోయారట. ఇపుడు పరస్థితి తారుమారయింది. ఎన్నికల అఫిడవిట్లలో కోట్లకు కోట్ల ఆస్తులు చూపిస్తున్నారు. చట్టసభల్లోకి వచ్చే వారిలో బిలియనీర్లే ఎక్కువగా ఉంటున్నారు.  తాము చేస్తున్న సేవలకు తీసుకునే వేతనం వ్యక్తి గతమయింది. దీని మీద వచ్చే ఆదాయపు పన్నను చెల్లించలేని దారిద్య్రంలో మంత్రులున్నారా? ఎవ్వరూ లేరు. అంతాకలసి ఏడాదికి మంత్రులకయితే  ఇన్ కమ్ టాక్స్ రెండు లక్షలు మించదు.

ఇక్కడొక బేసిన ప్రశ్న వుంది. ఇన్ కమ్ టాక్స్ కింద  వసూలు చేసుకునే  మొత్తం కూడా ఆదాయమే కదా.అది టాక్స్ బుల్ కదా.  మీర దీని మాటేమిటి?

మళ్ళీ జీతాల దగ్గిరకు వస్తే  1953 నుంచి 2021 జనవరి  మధ్య కాలంలో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల జీతాలను ఎన్నోసార్లు పెంచాయి. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం  ప్రజాప్రతినిధుల జీతాలను తప్పనిసరిగా పెంచుతూ వస్తున్నది. దీనికి అదనంగా ఇలా అలవెన్సులు ఉంటాయి.

అయితే, టాక్సబుల్ ఇన్ కమ్ క్యాటగిరీ కింద బాగా తక్కువ వేతనం చూపిస్తుంటారు. అందువల్ల వాళ్లు కట్టాల్సిన టాక్స్ బాగా తక్కువగా ఉంటుంది. మంత్రులు ఆ చిన్న మొత్తాన్ని  కూడా కట్టకపోతే ఎలా అని  ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి ‘ది ఫెడరల్ ’ కు చెప్పారు.  ఇది ఆమోదయోగ్యంకాదని  ఆయన అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి నెలసరి జీతం రు.. 4.10లక్షలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నెలసరి జీతం రు. 3.5లక్షలు. అంటే ఏడాదికి దాదాపు రు. 40 లక్షల నుంచి రు. 50 లక్షల దాకా ఉంటుంది.  వీళ్లకి పడే టాక్స్ మహా అంటే ఏడాదికి పదిక్షలు మించదు. మన ముఖ్యమంత్రులు ఈ చిన్న మొత్తం కూడా టాక్స్ గా కట్టలేని దౌర్భాగ్యమేమిటో?

వీళ్ల నివాసభవానలకు, కాన్వాయ్ కి, ఇతర బోగభాగ్యాలకయ్యే ఖర్చలన్నీ ప్రజలే చెల్లిస్తున్నారు.

“ఇన్ కమ్ టాక్స్ అనేది పర్సనల్ టాక్స్. ఇది ప్రభుత్వం  నుంచి తీసుకునే జీతాన్ని, ప్రభుత్వం నుంచి అందే ఇతర ఆదాయాలను బట్టి ఉంటుంది. మంత్రలు వాళ్లు నిర్వరిస్తున్న బాధ్యతలకు ప్రభుత్వం నుంచి తగిన వేతన ఇవ్వాలి.అయితే, దీనిమీద ఆదాయపుపన్నుకట్టాల్సింది మంత్రులే,” అని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్ ది ఫెడరల్ తో వ్యాఖ్యానించారు.

మంత్రుల జీతాల మీద ఇన్ కమ్ టాక్స్ ప్రభుత్వం కట్టినపుడు అది కూడా మంత్రి ఆదాయం కిందికే వస్తుందని,అపుడు డాని మీద ట్యాక్స్ వేయాల్సి ఉంటుందని  మరొక రిటైర్డు ఐఎఎస్ అధికారి మొహమ్మద్ షఫీకుజ్జామా ‘ది ఫెడరల్‘ తో అన్నారు. It is not only unethical to pay tax of ministers who are already paid for their services, but it is (also) technically flawed. Because the income tax by the government of any person is perquisite and is again taxable: Md Shaffiquazzaman.

మంత్రులు, ముఖ్యమంత్రులు ఖర్చులన్నీ దాదాపు ప్రభుత్వాలే భరిస్తుంటాయి కాబట్టి,  వాళంతా స్వచ్ఛందాగా జీతాలను త్యజిస్తూ పదవీ బాధ్యతలు స్వీకరించినపుడు ప్రకటన చేయాలి.స్వీడెన్ లో ఎంపిలు, మంత్రులు  సాదారణ బస్సులలో ప్రయాణించాల్సిందే. వాళ్ల జీతభత్యాలు కూడా అంతంతమాత్రమే. ఈచట్టాన్ని ఏ ప్రభుత్వం సవరించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *