జస్టిస్ ఎన్వీ రమణ పై , అక్టోబర్ 2020లో జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిఎస్ ఎస్ ఎ బాబ్డేకు నేరుగా లేఖ రాస్తూ జస్టిస్ రమణ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద పలు ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణల మీద , అంతర్గత విచారణ ( ఇన్ హౌస్ ఎంక్వయిరీ) జరిగిందని , ఫిర్యాదులో పసలేదని విచారణలో తేలిందని, అందువల్ల ఆ పిటీషన్ ను డిస్మిస్ చేస్తున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది.
ఫిర్యాదులోని ప్రధాన ఆరోపణలు
జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లబ్దిదారులని, జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖ దేశమంతా పెద్ద దూమారం రేపింది. అయితే, ప్రధాన న్యాయమూర్తికాకుండా అడ్డుకునేందుకే ఇలాంటి ఫిర్యాదు చేశారని కూడా సర్వత్రా వినిపించింది. ప్రతి ప్రధాన న్యాయమూర్తి నియామకం ముందు ఇలాంటివి వస్తుంటాయని కూడా కొంతమంది న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకే ముఖ్యమంత్రి స్వయంగా ఫిర్యాదు చేసిన వీటి వైటేజీ పడిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రమణ కూతూర్ల మీద సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ కేసుల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చినా,ఈ వ్యవహారమంతా మీడియాలో రచ్చరచ్చ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం రాదేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే, జగన్ లేఖ తర్వాత ఆంధ్రపదేశ్ ప్రధాన న్యాయమూర్తి బదిలీ కూడా జరిగింది.
అందుకే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే జస్టిస్ రమణ పేరును ప్రతిపాదిస్తారా లేదా , ఎవరి పేరు ప్రతిపాదించకుండా రిటైరవుతారా అనే చర్చకూడా మొదలయింది. ఇపుడు ఈ వివాదానికి తెరపడింది.దీని మీద హౌస్ ఎంక్వయిరీ వేశారు. ఈ నివేదిక ఎపుడూ వెల్లడికాదు.
ఈ రోజు జస్టిస్ బాబ్డే జస్టిస్ రణమని 48 ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేయడంతోనే ఈ ఆరోపణలు తిరస్కరణకు గురయ్యాయని అనుకున్నారు. అయితే, ఈ సాయంకాలం సుప్రీంకోర్టు ఫిర్యాదును కొట్టి వేసింది. ఈ మేరకు ఒక ప్రకటన సుప్రీం కోర్టు వెబ్ సైట్ లో పెట్టారు.
“A complaint dated October 6, 2020, sent by thee chief minister of Andhra Pradesh to the Supreme Court was dealt with under the In House Procedure, and the same, on due consideration, stands dismissed. It be noted that all the matters dealt with the under the In-house procedure being strictly confidential in nature, are not liable to be made public”, అని వెబ్ సైట్ ప్రకటనలో పేర్కొన్నారు.