MLC ఎలెక్షన్లకు స్కూళ్లు తెరిచారు, ఎన్నికలయ్యాక మూశారు: టీచర్ల ఆగ్రహం

విద్యార్థులను విద్యకు దూరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమా?:
USFI తెలంగాణ రాష్ట్ర కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి విద్యాసంస్థల బంద్ చేస్తూ విద్యా శాఖ మంత్రి ప్రకటించడం సిగ్గుచేటని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగూరి వెంకటేశ్వర్లు కార్యదర్శులు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మాదం తిరుపతిఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

కేవలం రాజకీయ లబ్ధి కోసమే విద్యా సంస్థలను ప్రారంభించి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ముగియగానే విద్యాసంస్థలను బంద్ చేయడం సరైంది కాదని వారు ఒక ప్రకనటలో  తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కేవలం తమ ఎన్నికలలో గెలుపు కోసమే విద్యాసంవత్సరం ప్రారంభించి ఎన్నికలు ముగియగానే కరోనా పేరు చెప్పి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఎంత వరకు సమంజసమా అని వారు ప్రశ్నించారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు నేటి నుంచి విద్యాసంస్థల బంద్ చేస్తున్నట్లు ప్రకటించడం సిగ్గుచేట.  దీని వల్ల పేద విద్యార్థులు మరింత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది, అని వారు ఆవేదన వ్యక్తం చేశారు..

దేశంలో ఏ రాష్ట్రంలో లేని జాగ్రత్తలు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుందని కెసిఆర్ గారి మాటలు వాటి నీటి మూటలు అయ్యాయని వారు వ్యాఖ్యానించారు. కరోనా నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే కరోనా ఎలా పెరుగుతుందని  దీనిపై కనీసం పరిజ్ఞానం లేకుండా ప్రభుత్వం మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.

కేవలం కార్పొరేట్ విద్యాసంస్థల యజమానుల ఎజెండానే ప్రభుత్వ ఎజెండాగా ముందుకు వెళ్తుంది.  ఈ విద్యాసంవత్సరం ప్రారంభించి ఫీజులను వసూలు చేసిన తర్వాతనే యజమాన్యల నిర్ణయం మేరకే ప్రభుత్వం విద్యాసంస్థలు బంద్ చేస్తున్నారు.   ప్రభుత్వ నిర్లక్ష్యానికి కప్పిపుచ్చుకునేందుకే విద్యాసంస్థల బంద్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి విద్యాసంస్థల బంద్ నిదర్శనం.  విద్యాసంస్థల బంద్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలి.

కనీసం విద్యా సంస్థలకు నిధులు కేటాయించకుండా విద్యా సంస్థలలో వసతులు కల్పించకుండా హడావిడిగా విద్యాసంవత్సరం ప్రారంభించి ఎన్నికల లబ్ధి పొందిన తర్వాత పాఠశాలలు మూసివేయడం ఏమిటి?ని

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల బందును విరమించుకొని విద్యార్థులకు విద్యను అందేవిధంగా కృషి చేయాలి.  అలాగే కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది.

( ఇది USFI తెలంగాణ రాష్ట్ర కమిటీ విడుదల చేసిన ప్రకటన. ఫోన్ నెంబర్
Cell No.9491962243)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *