సినిమా హళ్లు మూసేది లేదు: మంత్రి వివరణ

సినిమా ధియేటర్లను మూసి వేస్తారని వస్తున్న వదంతులను సినిమాటోగ్రఫీ  మంత్రి శ్రీనివాస యాదవ్ ఖండించారు. కోవిడ్ నిబంధనలతో సినిమా థియేటర్ లు యధావిధిగా నడుస్తాయని ఆయన  స్పష్టం చేశారు.

ఆయన ఏమన్నారంటే…

“కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దియేటర్లు మూతపడనున్నాయని జరుగుతున్న ప్రచారం అబద్దం. సినిమా దియేటర్ల మూసివేత పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చిత్ర పరిశ్రమ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న అనేకమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ రంగంపై ఆధారపడిన వివిధ విభాగాలలోని కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొన్నది. ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను తప్పనిసరిగా దియేటర్ల యాజమాన్యాలు పాటించాలి.”

కరోనాకేసులు పెరుగుతూ ఉండటంతో తెలంగాణలో థియేటర్లు మళ్లీ మూసివేసే అవకాశం ఉందని వూహాగానాలు రాష్ట్రంలో ఊపందుకున్నాయి. కోవిడ్ విపరీతం గా పెరుగుతూ ఉండటంతో ముందు జాగ్రత్త గా చర్యగా  రాష్ట్రంలో విద్యా సంస్థలన్నంటిని నిరవధికంగా మూసేసినతర్వాత ఇది హల్ చల్ చేయడం మొదలుపెట్టింది.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచే ఈ ప్రతిపాదన వెళ్లినట్లు సమాచారం.  కరోనా వ్యాప్తినివారణ లో ఆలస్యం జరగరాదని, ప్రభుత్వం అలసత్వం వహిస్తే మరింత ముప్పు తప్పదంటూ ఆరోగ్య శాఖ అధికారులు సూచించినట్లు తెలిసింది.  థియేటర్ల పూర్తి  మూసివేత సాధ్యం కాకుంటే  ప్రత్యామ్నాయంగా  కరోనా ప్రొటోకోల్  పాటిస్తూ నిర్వహించడం సాధ్యమా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.   తర్వాత బార్లు రెస్టరెంట్ల మీద  కూడా ఆంక్షలువిధించే  వీలుందని కూడా  చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి తలసాని వివరణ ఇచ్చారు. మూసివేత లేదని, కరోనా ప్రొటొకోల్ పాటిస్తూ ధియోటర్లను నడుపుతారని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *