కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం నిరసన దీక్ష

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ,డివిజన్ పోరాట సమితి అధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్ లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,డివిజన్ సాధనకై ఒక రోజు “నిరసన దీక్ష” చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో పార్టీలకతీతంగా రాజకీయ పార్టీల నాయకులు,ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొని ప్రసంగించారు.

ఈ నిరసన దీక్షకు పోరాటసమితి వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదె ఇన్నా రెడ్డి,కర్ర యాదవ రెడ్డి ల అధ్యక్షతన దీక్ష కొనసాగింది.

ఇందులో ప్రభుత్వ ప్రణాళిక మండలి బాధ్యులు బి.వినోద్ కుమార్ ,చాడ వెంకటరెడ్డి, దాస్యం వినయ భాస్కర్ ,జంగా రాఘవ రెడ్డి,కర్ర యాదవ రెడ్డి,రవిచందర్ ,సాయిని నరేందర్ ,నల్లెల్ల రాజయ్య,చొక్కయ్య,కొండ్ర నరసింగరావు,రాఘవేందర్ రావు,గోపు సోమయ్య,కేడల ప్రసాద్ ,బండి దుర్గాప్రసాద్ ,పుల్ల పద్మావతి,రవళి,రవిచందర్ ,చాపర్తి కుమార్ ,సోమ రామ్మూర్తి, నలిగింటి చంద్రమౌళి,రవిందర్ ,సందెల సునిల్ ,వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొని తమసంఘీభావాన్ని ప్రకటించీ కోచ్ ఫ్యాక్టరీ సాధించే దాక తాము ప్రత్యక్ష ,పరోక్ష ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధమేనన్నారు.

కర్ర యాదవ రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల కిందటనే కాజీపేటకు రావలసిన కోచ్ ఫ్యాక్టరీని కేంద్రప్రభుత్వం నానారకాల సాకులతో వేరే రాష్ట్రాలకు తరలించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.
ప్రస్తుతం తెలంగాణకు అవసరమే లేదని ఢంకా బజాయించి చెప్పడం మూలంగా తెలంగాణ ప్రజల ఆశలను నీరు కార్చి హామీని తుంగలో తొక్కడాన్ని సహించలేమన్నారు.

రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత శాసన సభ తీర్మాణం చేసి కేంద్రానికి పంపించాలని పోరాట సమితి పక్షాన డిమాండ్ చేశారు.

బి.వినోద్ కుమార్ మాట్లాడుతు ఇలా అన్నారు. ” కోచ్ ఫ్యాక్టరి సాధనకై ఢిల్లీలో ఐదు నాడు జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన దీక్షలో పాల్గొని పార్లమెంట్ సాక్షిగా సాధించడానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ అన్నది తెలంగాణ ఉద్యమం నుండి ఉంది. 1980 పీవీ మొదటిసారి హన్మకొండ ఎంపీ గా ఉన్నప్పుడు ఆయనకు తెలుసు.  అప్పటి జనతా ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తరువాత  నేను హన్మకొండ ఎంపి గా ఉన్న సమయంలో లేవనెత్తాము. ఉత్తరప్రదేశ్ , బీహార్ , బెంగాల్ రాయబరేలిలలో పెట్టినప్పుడు కోచ్ ఫ్యాక్టరి తెలంగాణ లో ఎందుకు పెట్టలేదు?  కోచ్ ఫ్యాక్టరి ఎప్పటికీ రాదని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరు. ఎప్పటికి బీజేపీ కేంద్రం లో అధికారంలో ఉండదనే గుర్తుంచుకోవాలి.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *