కార్తీ ‘సుల్తాన్’ ట్రైలర్ వైరల్!

 

తమిళ స్టార్, తెలుగులో చాలా ఫాలోయింగ్ వున్న హీరో కార్తీ,  లేటెస్ట్ యాక్షన్ సుల్తాన్ ట్రై లర్ ఈ రోజు సాయంత్రం విడుదలైంది. చెన్నైలో ఏర్పాటు చేసిన లాంచింగ్ ఈవెంట్ లో ట్రైలర్ నిమిషాల్లో వైరల్ అయింది.

        రెండునిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ లో కార్తీ ఫుల్ రేంజిలో రౌడీలతో, ముఠాలతో యాక్షన్ తో కన్పిస్తున్నాడు. పోరాటాలు ఆధారంగా రూపొందించిన యాక్షన్ ప్యాక్డ్ మాస్ మసాలా ఎంటర్టయినర్ లాగా కనిపిస్తోందిది. కార్తీ 100 మంది సోదరులలో చిన్నవాడట… ఇదో విచిత్ర కథ…వింత వింతగా, గమ్మత్తుగా వుంది. ఓ గ్రామంలో కొన్ని సామాజిక సమస్యలపై పోరాటమట.  మధ్య మధ్య రష్మికతో కార్తీ లవ్ ట్రాక్. యోగి బాబు కామెడీ. వివేక్ మెర్విన్ ఈనేపథ్యంలో పవర్ఫుల్ సంగీతాన్ని అందించాడు.

        దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ఇందులో ఇంకా నెపోలియన్లాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 2 న విడుదల కానుందికార్తీ గత మూవీ  ఖైదీ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *