(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి)
తిరుపతి ఉపఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ప్రచారం అన్న తర్వాత అనేక అంశాలు చర్చకు వస్తాయి.
రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో రాయలసీమ , నెల్లూరు జిల్లాల సమగ్రాభివృద్ధికి దోహదపడే అంశాలపై చర్చ జరగాలని భావిస్తోంది. అందులో భాగంగా పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి కీలక అంశాలు చర్చకు పెట్టే కృషి చేయాలని, అభ్యర్తించాలని నిర్ణయించింది.
అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారిని కలిసి పలు అంశాలపై చర్చించాను.
నెల్లూరు , చిత్తూరు జిల్లాల పరిధిలో ఉంటుంది తిరుపతి నియోజకవర్గం. వాతావరణ పరిస్థితులు , వనరులు , చెన్నై , బెంగుళూరు నగరాలకు దగ్గరగా ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఉండటం ఈ ప్రాంతం అభివృద్ధికి అనువైన ప్రాంతం.
కాంగ్రెస్ పాలనలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేశారు అందులో అత్యంత విజయవంతం అయినది శ్రీసిటీ. ప్రత్యేకహోదా లేకపోయినా వేల కోట్ల పెట్టుబడులు , పదుల సంఖ్యలో సంస్థలు , ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ప్రభుత్వం కొంత చొరవ తీసుకొంటే మంచి ఫలితాలు ఈ ప్రాంతానికి సొంతం అనడానికి శ్రీసిటీ మంచి ఉదాహరణ.
ఇప్పటికే కేంద్రం IIT , ఐజర్ లాంటి ప్రతిష్టాత్మకంగా సంస్థలు ఏర్పాటు చేసింది. నిర్మాణ దశలో ఉన్న మన్నవరం , విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం , రాయలసీమ అభివృద్ధి నిధులు మంజూరు చేసుకుంటే ఈ ప్రాంతం రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారడమే కాదు రాష్ట్రానికి ఆర్థిక , ఉపాధి కేంద్రంగా మారుతుంది.
సీనియర్ రాజకీయ నాయకులు అయిన చింతామోహన్ గారికి నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగాలి అన్న అంశంపై స్పష్టత ఉన్నది. వైయస్ కృషితో మన్నవరం ఏర్పాటుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపినా వారి మరణంతో నీలినీడలు అలుముకున్నాయి.
చింతామోహన్ కృషితో అది శంకుస్థాపన జరిగింది. తిరుపతి రుయాలో చిన్నపిల్లలు హాస్పిటల్ ఏర్పాటు , SVIMS లో 750 కోట్లతో క్యాన్సర్ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన ( నేడు అది రద్దు అయినది ) ముక్యంగా పోలవరం తర్వాత విభజన చట్టంలో హక్కుగా చేర్చబడింది దుగరాజపట్నం ఓడరేవు మాత్రమే. ఇది పూర్తిగా చింతామోహన్ గారి కృషి అని చెప్పాలి.
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్నారు. వర్తమాన ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అంశాలపై చర్చ జరగాలో వారికి చెప్పాల్సిన ప్రత్యేక అవసరం లేదు కాని మంచి చర్చ అయితే జరిగింది. మా ప్రయత్నం పార్టీ విధానాలు మంచి చెడులు ఆయా పార్టీల ఇష్టం.
విమర్శలు ప్రతివిమర్శలు రాజకీయాలలో సహజం చర్చకు వచ్చే అంశాలు చిత్తూరు , నెల్లూరు జిల్లాల సమగ్రాభివృద్ధికి దోహదపడేవి అయితే మంచిది. నేతల మధ్య జరిగే మాటలు నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కలవడానికి అవకాశం ఇచ్చిన రాజకీయ పార్టీల అభ్యర్థులు , నేతలను కలిసి కీలక అంశాలను దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతుంది. మా ప్రయత్నం వల్ల కొన్ని అంశాలలు అయినా చర్చకు వస్తాయని ఆశిస్తున్నాను.
(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ )