అనంతపురం, గుంటూరు జిల్లాల్లో కరోనా ఉదృతి, ఆందోళన

అనంతపురం, గుంటూరు జిల్లాల్లో కరోనా కలకలం పైవైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

అనంతపురం DMHO డాక్టర్ కామేశ్వరప్రసాద్, గుంటూరు DMHO డాక్టర్ యాస్మిన్  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఫోన్ లో మాట్లాడి పెద్ద ఎత్తున నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

అనంతపురం మెడికల్ కాలేజీ లో కరోనా సోకిన మెడికల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై DMHO డాక్టర్ కామేశ్వర ప్రసాద్ తో మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు.

ఇక్కడ మొదటి సంవత్సరం MBBS చదువుతున్న విద్యార్థులకు కరోనా సోకింది.  దీనితో వారిని  అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించి మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నారు.

మెడికల్ కాలేజీ లో మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 4వేలు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా 106మందికి కరోనా నిర్ధారణ అయిందని డిఎంహెచ్ వొ తెలిపారు. కరోనా సోకిన 22మందికి గవర్నమెంట్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం కోసం అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.

జిల్లాలో 66మంది కరోనా బాధితులు హోమ్ క్వారంటైన్ లో వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారని, ప్రతి రోజు మెడికల్ టీమ్ వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారని ఆయన మంత్రికి తెలిపారు.

ఈ రోజు అనంతపురం జిల్లాలో ఈరోజు 8కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 4గురు అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ కాగా, మిగిలిన 4గురు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 8కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి… బెడ్స్ అందుబాటులో ఉన్నాయి…

ఇక పోతే, గుంటూరు జిల్లా రేపల్లె లో 7గురికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా సోకిన బాధితులకు మెరుగైన వైద్యం కోసం రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో మరిన్ని జాగ్రత్త లు తీసుకోవాలని అనంతపురం, గుంటూరు DMHO లను  మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *