నిన్న ‘విరాటపర్వం’ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ నోరు జారారా? తను నటిస్తున్న ‘ఆచార్య’ రహస్యాల్ని ఎందుకు పదేపదే లీక్ చేస్తున్నారు? ‘విరాటపర్వం’ తో ‘ఆచార్య’ కున్న పోలిక ఏమిటి? ఇలా ఎందుకు లీక్ చేస్తున్నారు? ఇవి ‘ఆచార్య’ కి నష్టం చేయవా? ఇవీ అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు.
రానా నటిస్తున్న ‘విరాట పర్వం’ సినిమా టీజర్ ని నిన్న రిలీజ్ చేస్తూ చిరంజీవి, టీజర్ చూస్తుంటే సినిమా నక్సల్స్ బ్యాక్ గ్రౌండ్ అనిపిస్తుంది, మా ‘ఆచార్య’ సినిమా కూడా నక్సల్స్ బ్యాక్ గ్రౌండే అనేశారు.
నిజానికి ‘ఆచార్య’ సినిమా థీమ్ దేవాలయాల్లో అవినీతి గురించి వుంటుందని మొదట్నుంచీ అనుకుంటున్నదే. అయితే అవినీతికి, నక్సలిజం పాయింటు కూడా జోడించారని పుకార్లు కూడా వున్నాయి. ఇది నిజమని ఇప్పుడు చిరంజీవి మాటలతో తేలిపోయింది.
ప్రారంభంలో కొరటాల శివ దర్శకత్వంలో తను చేస్తున్న సినిమా ‘ఆచార్య’ అంటూ టైటిల్ ని రివీల్ చేసేశారు చిరంజీవి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదని నాలిక కర్చుకున్నారు. ఇంకోసారి ‘ఆచార్య’ లో ప్రత్యేక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్టు రివీల్ చేసేశాఋ. ఇప్పుడు నక్సల్ బ్యాక్ గ్రౌండ్ అంటూ చెప్పేశారు.
‘ఆచార్య’ మే 14 కి రిలీజ్ అనుకుంటున్నారు. ఈలోగా చిరంజీవి ఇంకెన్ని సీక్రెట్స్ బయట పెడతారో చూడాలి. సినిమా రిలీజ్ కంటే ఆయన చెప్పే సీక్రెట్స్ కోసమే ఎక్కువ ఎదురుచూసేలా వున్నారు ప్రేక్షకులు. నెక్స్ట్ ‘ఆచార్య’ లో ఎన్ని ఫైట్స్ వున్నాయి చెప్తారేమో.