SEC నిమ్మగడ్డ మీద సభాహక్కుల ఉల్లంఘన విచారణ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సభా హక్కుల ఉలంఘన  విచారణ జరపాలని  అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ నిర్ణయించింది. ఈ రోజు కమిటీ  చైర్మన్ గోవర్థన్ రెడ్డి అధ్యక్షతన మావేశమయి ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు రమేష్ కుమార్ మీద  సభా  హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుపై పిర్యాదు చేశారు. తమ హక్కులకు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా  నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలు చేసినందున ఆయన మీద సభా హక్కుల ఉల్లంఘన  చర్యలు తీసుకోవాలని జనవరిలోనే మంత్రులిద్దరు స్పీకర్ తమ్మినేని సీతారామ్ విజ్ఞప్తి చేశారు. తాము  లక్ష్మణ రేఖ దాటి, ఎన్నిలక కోడ్ ను అతిక్రమించారని నిమ్మగడ్డ గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారని అది నిరాధారమయిన ఆరోపణ అని గతంలో వారు స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

“In his letter (to the governor) he (Ramesh Kumar) alleged that I have crossed Laxmana Rekha and violated the model code of conduct. Making such an allegation without any substantial proof amounts to a breach of privilege. Being a senior member of the Legislative Assembly and as well as a minister in the cabinet, I have impeccable respect for all the constitutional bodies and especially to the election commission,” అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్ది స్పీకర్ కు రాసిన లేఖ లో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదును  కమిటీ ఈ రోజు చర్చించింది. అనంతరం ఈ ఫిర్యాదుల మీద విచారణకు అందుబాటులో ఉండాలని కోరుతూ  ఎస్ ఇ సికి లేఖ రాయాలని కమిటీ అసెంబ్లీ సెక్రెటరీని ఆదేశించింది. రమేష్ కుమార్ కురేపు లేఖ పంపే అవకాశం ఉంది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *