“జీతం పంచాయితీకి, కార్యదర్శి పరలోకానికి”

జూనియర్ పంచాయితీ కార్యదర్శి ఆత్మహత్య, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శన. జూనియర్ పంచాయితీ కార్యదర్శి ఆత్మహత్య, ఇకనైనా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ 

మెదక్ జిల్లా లోని ఆందోల్ లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయితీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకోవడం మీద విచారణ వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మహత్య చేసుకునేపరిస్థితిని క్పల్పించింది తెలంగాణ ప్రభుత్వమే ఏఐసీసీ కార్యదర్శి శ్రీ వంశీచంద్ రెడ్డి ఆరోపించారు.

17-03-2021 నాడు యం. జగన్నాథ్ అనే జూనియర్ పంచాయితీ కార్యదర్శి విధులు నిర్వహించడం భారమయి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

చాలా బాధాకరమయిన దుర్ఘటన అని వ్యాఖ్యానిస్తూ  తెలంగాణ సమాజంలో జరిగిన ఇట్టి ఘటన జరగినందుకు ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు.

ఈ రోజు జరిగిన అతి దురదృష్టకరమైన సంఘటన ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో  ప్రభుత్వ వైఫల్యానికి  ఇది నిదర్శనం అన్నారు.

ఆత్మహత్య చేసుకున్న జూనియర్ పంచాయితీ కార్యదర్శి వ్రాసిన సూసైడ్ నోట్లోని అంశాలు ప్రస్తావిస్తూ,  తనకు వచ్చిన జీతం తిరిగి పంచాయితీ కార్యాలయ ఖర్చులకే వినియోగించినట్టు చాలా స్పష్టంగా పేర్కొన్నారని, ఇది హృదయ విదారకమయిన పరిణామం అని అన్నారు.

‘ ప్రభుత్వం ఒకవైపు అసలే కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మరొక  జూనియర్ పంచాయితీ కార్యదర్శులపై అదనపు భారం మోపుతూ ఉంది. వారికిచ్ఛే అరకొర జీతాన్ని కూడా తిరిగి ఈ అదనపు బాధ్యతలు నిర్వహించేందుకు  వారు ఖర్చు పెడుతున్నారు.ఇది చాలా క్రూరమైన చర్య,’ అని  అభివర్ణించారు .

జీతం పంచాయితీకి , పంచాయితీ కార్యదర్శి పరలోకానికి

రాష్ట్రంలో పనిచేస్తున్న జూనియర్ పంచాయితీ కార్యదర్శుల ప్రస్తుత పరిస్థితి పై ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ “జీతం పంచాయితీకి , పంచాయితీ కార్యదర్శి పరలోకానికి” అన్నారు. ప్రభుత్వం ఇకనైనా జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు . జూనియర్ పంచాయితీ కార్యదర్శుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అన్నారు. విధుల పేరుతో జూనియర్ పంచాయితీ కార్యదర్శులు అన్ని పనులు చేయాలనడం , చదువు కున్నా కూడా ఆత్మ గౌరవానికి భంగం కలగడం ఆత్మ హత్యలకు ప్రధాన కారణమని, జూనియర్ పంచాయితీ కార్యదర్శుల విధులను పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *