శుక్రవారం మిని ఫిల్మోత్సవ్, విడుదలవుతున్న4 సినిమాలు

ఈ శుక్రవారం మరో నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. మార్చి 19 న విడుదలవుతున్న ఈ నాల్గూ ప్రముఖ హీరోలవే.

ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో వారసుడు పవన్ తేజ్ కొణిదెల ప్రేక్షకుల్లోకి వచ్చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 లో చిన్న పాత్ర వేసిన ఇతను ఇక పూర్తి స్థాయి హీరోగా వచ్చేస్తున్నాడు. ఈ కథలో పాత్రలు కల్పితం దీని టైటిల్. ఎంవిటి ఎంటర్టయిన్మెంట్స్ పతాకంపై రాజేష్ నాయుడు నిర్మించిన దీనికి అభిరామ్ ఓం దర్శకత్వం వహించాడు. పవన్ తేజ్ సరసన మేఘనా కుమార్ హీరోయిన్ గా నటించింది. సంగీతం కోసం కార్తీక్ కొడకండ్లఛాయాగ్రహణం, సునీల్ కుమార్ ఎన్ఎడిటింగ్ తిరు బి సమకూర్చారు.

ఆర్ ఎక్స్ 100  ఫేమ్ హీరో కార్తికేయతో  చావు కబురు చల్లగా రోమాంటిక్ కామెడీ ఎంటర్టయినర్ గా వుంటుంది. ఇందులో లావణ్యా త్రిపాఠీ హీరోయిన్. దీనికి పి. కౌశిక్ కొత్త దర్శకుడు. జిఎ పిక్చర్స్ నిర్మాణం. ఇందులో ఇంకా ఆమనిమురళీ శర్మశ్రీకాంత్అయ్యంగార్రజితఅచంట మహేష్భద్రమ్ప్రభు ఇతర పాత్రల్లో నటించారు. ఒక శవాల్ని తీసికెళ్ళే మార్చ్యురీ వ్యాన్ డ్రైవర్ కీ, నర్సుకీ  మధ్య కామెడీగా సాగే ప్రేమ కథ ఇది.

 ఇక మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు చాలా కాలం తర్వాత దర్శన మిస్తున్నాడు. మోసగాళ్ళు అని టైటిల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కాదుగానీ  విష్ణుకి సోదరిగా కనిపించబోతోంది. ఏవీఏ ఎంటర్టయిన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణం. జెఫ్రీ జీ చిన్ దర్శకుడు. 2016 లో మీరా రోడ్ కాల్ సెంటర్ సంఘటనని తెరకెక్కించారు.

ఇక చాలా కాలం తర్వాత వస్తున్న ఇంకో వారసుడు, సాయికుమార్ కుమారుడు ఆది నటించిన శశి రోమాన్సు, డ్రామాలతో కూడి వుంటుంది. సురభి హీరోయిన్. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఆర్‌పి వర్మచావళి రామంజనేయులుచింతలపూడి శ్రీనివాస రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకుడు. రాశీ సింగ్జయప్రకాష్రాజీవ్ కనకాలఅజయ్వైవా హర్ష ఇతర  తారాగణం. సంగీతం అరుణ్ చిలువేరుఛాయాగ్రహణం అమర్‌నాథ్ బొమ్మిరెడ్డిఎడిటింగ్ సత్య జి. ఈ నాల్గు సినిమాలకి ప్రేక్షకుల తీర్పు ఎలా వుంటుందో శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *