ఇక నుంచి ఎవరైనా B.Tech కోర్సుల్లో చేరవచ్చు : AICTE

ఇంజనీరింగ్ కోర్సు లు (బిఇ, బిటెక్) చదివేందుకు ఇంటర్ మీడియట్ ల్ ( 12 వ తరగతిలో) కచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్ లు చదివి ఉండాలన్న నియమాన్ని ఎఐసిటిసి (All India Council for Technical Education-AICTC) సడలించింది. 2021-2022 సంవత్సరానికి ఇంజనీరింగ్ అండర్ గ్రాజుయేట్ కోర్సుల అడ్మిషన్ అర్హతలను ఎఐసిటిసి సడలించింది.

ఈ సంవత్సరానికి ఇంజనీరింగ్ కోర్సుల అడ్మిషన్ హ్యాండ్ బుక్ లో అర్హతలను విస్తృతం చేసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

కొత్త నియమాల ప్రకారం  ఇంటర్ లేదా 10+ స్థాయిలో  ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జక్టులను కంపల్సరీ చదివి ఉండాలనే నియమం తొలగించింది. మ్యాథ్స్, ఫిజిక్స్,  కెమిస్ట్రీ,  కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ,  ఎలెక్ట్రానిక్స్, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ ఫర్మాటిక్స్ ప్రాక్టిసెస్, టెక్నికల్ వొకేషన్ సబ్జక్టులు, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ,బిజినెస్ స్టడీస్,యాంట్ర ప్రెన్యూర్ షిప్  కోర్సులు ఏవైనా మూడు సబ్జక్టులు బోధనాంశాలుగా తీసుకున్న వారంతా  బిఇ, బిటెక్ కోర్సుల్లో చేరవచ్చు. ఇది నేషనల్ ఎజుకేషన్ పాలసీ ప్రకారం తీసుకున్న నిర్ణయమని, దీని వల్ల  విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకునేందుకు స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన నూతన విద్యావిధానం (5+3+3+4)లో అర్ట్స్, సైన్స్,  కామర్స్ అనే కోర్సులుండవు. పైన పేర్కొన అర్హతాంశాలలో నుంచే విద్యార్థులు తమకు ఇష్టమయిన వాటిని ఎంచుకోవలసి ఉంటుంది.అందుకే అందరికి ఇంజనీరింగ్ కోర్సులలోచేరే ర్హత సమానంగా ఉంటుంది.

కాకపోతే, ఈ మూడు సబ్జక్టులలో విద్యార్థులు కనీసం 45 శాతం మార్కులు పొంది ఉండాలి.  రిజర్వుడ్ క్యాటగరి కింద వచ్చే విద్యార్థులు  40 శాతం మార్కులు పొంది ఉండాలి. “The Universities will offer suitable bridge courses such as Mathematics, Physics, Engineering drawing for students coming from diverse backgrounds to achieve learning outcomes of the program,” AICTE  కొత్త హ్యాండ్ బుక్ లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *