హిందూపురంలో క్యూలో నిలబడి ఓటేసిన ఎమ్మెల్యే బాలయ్య

హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  పట్టణంలోని చౌడేశ్వరి కాలనీ రెండో వార్డులో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన  సతీ సమేతంగా  తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్ల తో పాటు క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

మరిన్ని ఆంధ్రా విశేషాలు

ఏలూరు: మంత్రి ఆళ్ళ నాని కి షాక్ . ఏలూరు లోని శనివారపు పేట లో నాని ఓటు గల్లంతు నాని ఓటు స్థానంలో మహిళ పేరు వచ్చింది. ఓటు వేయడానికి వచ్చిన నాని ని తిరిగి పంపిన అధికారులు.

లగడపాటి రాజగోపాల్ :  గెలిచినా ఓడినా పవన్ ప్రజలను అంటి పెట్టుకుని ఉండటం అభినందనీయుడు. ఎందుకంటే  సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా పవన్ కల్యాణ్ స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగారు. రాజకీయాలకు ముందు నుంచే సీఎం వైఎస్ జగన్‌తో  స్నేహం ఉంది. సీఎం కావాలన్న కోరికను  జగన్ నెరవేర్చుకున్నారు. మరో మూడేళ్ల పాలన తర్వాతే జగన్ పాలన ఎలా ఉందో తెలుస్తుంది. :మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్

తిరుపతి వేద పాఠశాలలో కోవిడ్: తిరుమల వేదపాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. వేదపాఠశాలలోని 58మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిని తిరుపతి స్వీమ్స్ వి తరలించి చికిత్స చేయిస్తున్నారు

రెండేళ్ళలో విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్‌

న్యూఢిల్లీ, మార్చి 10: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో నిర్మిస్తున్న కొత్త ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ 2023 మార్చి నాటికి సిద్ధం అవుతుందని రాజ్యసభలో బుధవారం పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు.  611.80 కోట్ల రూపాయల వ్యయంతో విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో సరికొత్త ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) టవర్‌, యాప్రాన్‌, లింక్ టాక్సీవే తదితర నిర్మాణాలను చేపట్టాడానికి గత ఏడాది జూన్‌ 17న ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదాన్ని ఇస్తూ నిధులను మంజూరు చేసినట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు.

ఒటేసిన పవన్ కల్యాణ్

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ విజయవాడ పటమటలో మునిసిపల్ ఎన్నికల్లో  ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటమటలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల ఉన్నతపాఠశాల 99వ వార్డులోని 4వ పోలింగ్‌ స్టేషన్‌లో) పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *