కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీద రౌండ్ టేబుల్ రిపోర్టు

(నల్లెల రాజయ్య)

ముందుగా కాజీపేట ఫ్యారాడైజ్ ఫంక్షన్ హాల్ లో కోచ్ ఫ్యాక్టరీ సమర సన్నద్ద రౌండ్ టేబుల్ సమావేశము కు వచ్చిన మీ అందరికీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ-డివిజన్ పోరాట సమితి సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది.

*నాటి ఆరు దశాబ్దాల సమైక్యాంధ్రప్రదేశ్ లో గానీ, నేటి ఏడేళ్ళ స్వరాష్ట్రం తెలంగాణ లో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ,జంక్షన్ డివిజన్ సాధన అనేది యెన్నో దశాబ్దాల ప్రజా ఆకాంక్ష, రాజ్యాంగ బద్ధ హక్కు. అయినా అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్ని రకాల పాజిబులిటీస్ వున్నప్పటికీ ఇప్పటికే మూడుసార్లు మన వరంగల్ ప్రాంతానికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.

*పివి నరసింహరావు కాలంలో మొదటిసారి కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట కు మంజూరు చేసి మాడికొండ, రాంపూర్ ప్రాంతంలో1500 ఎకరాలు భూమి కోసం సర్వే కూడా చేసారు. ఆశనిపాతము వలే రాజకీయ కారనాలతో పంజాబుకు తరలించారు.

*మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో కాజీపేట కో రెండోసారి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఉత్తరప్రదేశ్ రాయబరేలి కి తరలించి మొండి చేయి చూపారు.

తాజాగా రాష్ట్ర విభజన చట్టం లో 13 వ షెడ్యూల్ 10 వ అంశం గా తెలంగాణ రాష్ట్రంకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని పార్లమెంట్ లో నాటి మన్మోహన్ సింగ్ ప్రధానిగా యుపిఎ ప్రభుత్వం చట్టం గానే చేసింది.
ఇపుడు అసలు కనుచూపు మేరలో కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ఇచ్చేది లేదని కేంద్ర హోంశాఖ చావు కబురు చల్లగా చెప్పి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇన్నీ దశాబ్దాలుగా ఈ ప్రాంత పాలకులు నిర్లక్ష్యం కారణంగా మనకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రాకుండా పోతున్నది.
*రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లుగా ఒక్క అంశం ముందుకు పడకపోవడం వైఫల్యం ఖచ్చితంగా ఈ ప్రాంత పాలకుల పట్టింపు లేని నిర్లక్ష్యం అని వేరే చెప్పనవసరం లేదు.

కాజీ పేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ మీద జరిగిన రౌండ్ టేబుల్

*తాజాగా….. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకి ఈ మేరకు సమాధానం ఇక దేశంలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టే ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వం కు లేదని హోంశాఖ తెలియజేయడం తెలంగాణ ప్రాంతానికి ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు జీర్ణించుకోలేని అంశం.

*ఈ కేంద్ర నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడమే.

*దీనిని తెలంగాణ రాజకీయ పార్టీలు, తెలంగాణ సమాజం మొత్తం ఖండించాలి.

రాష్ట్ర విభజన చట్టంలో ఖాజీపేట కు కోచ్ ఫ్యాక్టరీ స్థాపన అనే అంశం ను కేంద్రం పాతర వేయడాన్ని ప్రతిఘటించడానికి విశాలమైన ఐక్య ఉద్యమం నిర్మాణం చేద్దాం.

*కోచ్ ఫ్యాక్టరీ,డివిజన్ సాధన తో ఈ ప్రాంత అన్ని వర్గాల అభివృద్ధి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం వేలాది ఉద్యోగాల కల్పన,ఈ డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్లో పూలు అమ్మే కూలి నుండి ఇక్కడి నగరాల్లోని వాణిజ్య,వ్యాపార అభివృద్ధి కూడా ముడిపడి ఉంది.

*తాజాగా కేంద్రం నిర్ణయం ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే వరంగల్ తో పాటు తెలంగాణ రాష్ట్రానికి సైతం తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు.పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు.

*తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఒక వైపు ప్రజా పోరాటాలు, ఈ ప్రాంత రాజకీయ పార్టీలు, MP లు,ప్రజా ప్రతినిధులు రాజీనామా లకైనా సిద్ధపడి పార్లమెంట్లో కేంద్రము పై ఒత్తిడి జమిలీ గా జరగాల్సిన అవసరం ఉంది.

* రైల్వేలను మొత్తం ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూడడము అన్యాయం. దేశము లోని సామాన్య ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది.ఈ నిర్ణయాలు ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు నిర్మాణం చేయాల్సిన అవసరం వుంది.*
ఇప్పటికే వివిధ సెక్షన్ ల ప్రజలు ప్రయివేటికరన కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పరిస్థితి ఉన్నది.*

భారత రవాణా వ్యవస్థకు గుండెకాయ అయిన రైల్వేలను ప్రైవేట్ పరం చేయడం జాతి వ్యతిరేక చర్య దీనిని దేశ ప్రజలందరు వ్యతిరేకించి పోరాడాలని పిలుపు నిస్తున్నాము.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ సాధన కోసం విశాల ఐక్య ఉద్యమ నిర్మాణం కోసం రైల్వే జేఏసీ-ఖాజీపేట డివిజన్ సాధన కమిటీ-ప్రజా సంఘాలు,కార్మిక సంఘాలు, కుల సంఘాలు, వివిధ సామాజిక బృందాలు, ఉద్యమకారులు,జర్నలిస్టులు,న్యాయవాదులు, మహిళా సంఘాలు, దళిత, ఆదివాసీ,మత ,మైనారిటీ, సబ్బండ వర్గాలు ఒకే వేదిక పై ఒకే పేరుతో, సమష్టి నాయకత్వములో ఒకే జెండగా ఒకే ఎజెండా గా కోచ్ ఫ్యాక్టరీ-డివిజన్ పోరాట సమితి గా ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఉద్యమం నిర్మాణం అవుతోంది.

ఈ సమావేశం ద్వారా ప్రత్యక్ష కార్యాచరణ పోరాట రూపాలను మన అందరి సమష్టి భాగస్వామ్యం తో ఉత్తర తెలంగాణ 10 జిల్లాలో ఉద్యమం ఉదృతం చేసేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నము.

ఈ రౌండ్ టేబుల్ సమావేశం కు హాజరైన కార్మిక సంఘాల, ప్రజాసంఘాల,విద్యార్థి,యువజన,నిరుద్యోగ యువత,మహిళా, మత,మైనారిటీ, దళిత,ఆదివాసీ సంఘాల,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరైన మీరంతా విశాల ఐక్య ఉద్యమం లో భాగం కావాలని పిలునిస్తున్నాం

డిమాండ్స్:

1.తెలంగాణ కు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చేది లేదన్న కేంద్ర హోంశాఖ ప్రకటన ను వెంటనే వెనక్కి తీసుకోవాలి.

2.తెలంగాణ కు రాజ్యాంగ బద్ధ హక్కు ,పార్లమెంట్ సాక్షి గా హామీ పడ్డ ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చర్యలను ను వెంటనే చేపట్టాలి.

3.రైల్వేలను మొత్తం ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూడడము అన్యాయం. దేశము లోని సామాన్య ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది.ఈ నిర్ణయాలు ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి.*

4.ఉత్తర తెలంగాణ 10 జిల్లాల అభివృద్ధి గుండెకాయ, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉద్యోగ కల్పన అంశం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ,ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలి.

ఈ రోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఉదయం 11గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ చర్చ జరిగింది.

నిర్వాహకులు కర్ర యాదవ రెడ్డి,గాదె ఇన్నా రెడ్డి, గోపు సోమయ్య,బి.ఆంజనేయులు రాఘవేందర్ ,కోండ్ర నర్సింహులు ,వేద ప్రకాశ్ ,ఓంప్రకాశ్ ,జానీ మియా,నల్లెల్ల రాజయ్య ,బండి దుర్గాప్రసాద్ ,లతో పాటుప్రధాన రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులైన యం.చుక్కయ్య,నున్నా అప్పారావు,దాస్యం వినయభాస్కర్ ,బండా ప్రకాశ్ ,నాయిని రాజేందర్ రెడ్డి,జంగా రాఘవరెడ్డి మరియు ప్రజాసంఘాల నాయకులు డా.చంద్రభాను,ఆంజనేయులు,రత్నమాల,కోగిల చంద్రమౌళి,కొమ్ము సురేందర్ ,జి.రవీందర్ ,జి.కుమార స్వామి లతో పాటు వందమందికి పైగా వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

(నల్లేల రాజయ్య, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ-డివిజన్ పోరాట సమితి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *