విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణవ్యతిరేక ఉద్యమానికి తెలంగాణ నుంచి మద్దతు లభించింది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిరామారావు తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ పోరాటంలో తాము వెన్నంటి ఉంటామని ప్రకటించారు. అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో విశాఖ వెళ్లి అక్కడే నిరసన తెలుపుతామని కూడా ఆయన ప్రకటించారు. “విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు… అని సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేస్తున్నారు. ఈ రోజు విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ కావచ్చు.రేపు తెలంగాణలో ఇదే జరగవచ్చు .అందువల్ల రెండు రాష్ట్రాలు కలసి కేంద్రం ధోరణిని వ్యతిరేకించాలి”, అని ఆయన అభిప్రాయపడ్డారు.