తొమ్మిది రిలీజయితే ఒకటే ‘పర్వాలేదు’!


నిన్న శుక్రవారం రికార్డు  స్థాయిలో విడుదలైన 9 సినిమాల బాక్సాఫీసు రిజల్ట్ ఇలావుంది… సందీప్ కిషన్ ఏ వన్ ఎక్స్ ప్రెస్’, రాజ్ తరుణ్ పవర్ వర్ ప్లే’, దేవినేని’, తోటబావి’, క్లయిమాక్స్’, గజకేసరి ఈ ఆరూ ప్రేక్షకుల చేత నో అన్పించుకున్నాయి. సందీప్ కిషన్, రాజ్ తరుణ్ ల సినిమాలైతే మరీ పురాతనంగా వున్నాయి. ఈ ఇద్దరు హీరోలు ఇంకా ఏ కాలంలో వున్నారో. ఇక  దేవినేని’, తోటబావి’, క్లయిమాక్స్’, గజకేసరి’… వీటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీటికి థియేటర్ అద్దెలు కూడా రావు.

 షాదీ ముబారక్ కూడా రొటీన్ ప్రేమ సినిమానే. కాకపోతే మిగిలిన వాటికంటే ఫర్వాలేదు.

ఇక ఈ తొమ్మిదిలో ఒకటే కాస్త చెప్పుకోదగ్గ మూవీగా వుంది. అది ప్లేబ్యాక్’. ఈ థ్రిల్లర్ కొత్తగా, ఇదివరకు రాని కథతో తీయడం వల్ల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

అయితే ఇది మిరేజ్ అనే స్వీడిష్ మూవీకి కాపీ. దీని దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ జక్కా హరిప్రసాద్. ఈ సినిమాలన్నీ ఓటీటీ బూమ్ కి ముందు ప్రారంభమైనవి.  కాబట్టి ఆ నాటి ట్రెండ్ లో అలా తీశారు. ఓటీటీ ట్రెండ్ లో మారిన ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచులతో ఇప్పుడు ప్రారంభమవుతున్న సినిమాలు కాస్త భిన్నంగా ఉండవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *