నిన్న శుక్రవారం రికార్డు స్థాయిలో విడుదలైన 9 సినిమాల బాక్సాఫీసు రిజల్ట్ ఇలావుంది… సందీప్ కిషన్ ‘ఏ వన్ ఎక్స్ ప్రెస్’, రాజ్ తరుణ్ ‘పవర్ వర్ ప్లే’, ‘దేవినేని’, ‘తోటబావి’, ‘క్లయిమాక్స్’, ‘గజకేసరి’ ఈ ఆరూ ప్రేక్షకుల చేత నో అన్పించుకున్నాయి. సందీప్ కిషన్, రాజ్ తరుణ్ ల సినిమాలైతే మరీ పురాతనంగా వున్నాయి. ఈ ఇద్దరు హీరోలు ఇంకా ఏ కాలంలో వున్నారో. ఇక ‘దేవినేని’, ‘తోటబావి’, ‘క్లయిమాక్స్’, ‘గజకేసరి’… వీటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీటికి థియేటర్ అద్దెలు కూడా రావు.
‘షాదీ ముబారక్’ కూడా రొటీన్ ప్రేమ సినిమానే. కాకపోతే మిగిలిన వాటికంటే ఫర్వాలేదు.
ఇక ఈ తొమ్మిదిలో ఒకటే కాస్త చెప్పుకోదగ్గ మూవీగా వుంది. అది ‘ప్లేబ్యాక్’. ఈ థ్రిల్లర్ కొత్తగా, ఇదివరకు రాని కథతో తీయడం వల్ల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
అయితే ఇది మిరేజ్ అనే స్వీడిష్ మూవీకి కాపీ. దీని దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ జక్కా హరిప్రసాద్. ఈ సినిమాలన్నీ ఓటీటీ బూమ్ కి ముందు ప్రారంభమైనవి. కాబట్టి ఆ నాటి ట్రెండ్ లో అలా తీశారు. ఓటీటీ ట్రెండ్ లో మారిన ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచులతో ఇప్పుడు ప్రారంభమవుతున్న సినిమాలు కాస్త భిన్నంగా ఉండవచ్చు.