తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదు

తెలంగాణ రాష్ట్రం లో కరోనా సెకండ్ వెవ్ లేదు అని తెలంగాణ ఆరోగ్య మంత్రి  ఈటెల అన్నారు. హూజూరాబాద్ లో తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ మేరకు భోరోసా ఇచ్చారు.  రాష్ట్రంలో అనేక చోట్ల కొత్త కేసులు కనబడుతున్నట్లు మీడియా వార్తలు వస్తుండటంతో ఆయన ఇలా వ్యాఖ్యానించారు.

అక్కడక్కడ కొవిడ్‌ కేసులు మళ్లీ నమోదవుతున్న విషయాన్ని ‘ఈనాడు’ రిపోర్టు చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం  సంగారెడ్డి జిల్లాలో 12 మంది విద్యార్థులకు, మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులకు, మేడారంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులకు శనివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా మరో 178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 2,98,631కి చేరుకుంది. మహమ్మారికి చిక్కి మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 1633కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీలో 30 కేసులు నమోదవగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 20, రంగారెడ్డి 15, కరీంనగర్‌లో 10 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 12 మందికి విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి మాజీద్‌ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నత పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు మరో మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఒక టీచర్‌కు కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నెల రోజులుగా సమ్మక్క సారలమ్మ చిన్న జాతర విధుల్లో ఉన్న ముగ్గురు ఆలయ ఉద్యోగులకు ఆరోగ్య శిబిరంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో అప్పయ్య తెలిపారు.

ఈ వార్తలను దృష్టిలో పెట్టుకుని మంత్రి ఈటెల్ స్పష్టత నిచ్చారు.

భారత ప్రభుత్వ ఆదేశానుసారం నేటి నుండి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో 45 సంవత్సరాలు పై బడి దీర్ఘ కాలిక రోగాలు ఉన్న వాళ్లకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నామని, ఎంపిక చేసిన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా అందుబాటులో  వుందని చెబుతూ అక్కడ  కరోనా వ్యాక్సిన్ ఒక్క డోస్ కు 250 రుపాయలు చెల్లించాల్సి ఉంటుందని మంతి ఈటెల  చెప్పారు.

వ్యాక్సిన్ విషయం లో అపోహలు నమ్మొద్దు. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని అందుబాటులో ఉన్న ఆసుపత్రులలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి, అని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *