మా తెలంగాణ మేం పాలించుకుంటాం…. షర్మిలకు రేవంత్ హెచ్చరిక

ముఖ్యమంత్రి కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల పార్టీ అని కాంగ్రెస్ మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెశిడెంట్  రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.  తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే ప్రజలు వప్పుకోరని అంటూ రాజన్న బిడ్డగా ఆమెకు సారె పెడతాం తప్ప పార్టీ పెడితే ఊరుకోం అని అన్నారు.

రంగారెడ్డి జిల్లా రావిరాలలో నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరి సభలో రేవంత్ ప్రసంగిస్తూ షర్మిలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రా  కు చెందిన షర్మిల తెలంగాణలో పార్టీ పెడతానని బహిరంగంగా ప్రకటన చేస్తే ఒక్కమాట మాటకూడా నోరుమెదపని నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆరే నని ఆయన అన్నారు. ‘అనుమానం లేదు, షర్మిల కెసిఆర్ కాంగ్రెస్ మీదకు ప్రయోగించిన బాణమే,’ అని అన్నారు.

తెలంగాణ వద్దు, సమైక్య రాష్ట్రం ముద్దు అన్నందుకు తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బిడ్డలకు ముందు క్షమాపణ చెప్పాలని కూడా రేవంత్ రెడ్డి షర్మిలను డిమాండ్ చేశారు.

‘తెలంగాణ బిడ్డలు ఏలుకోవడానికి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ రాజన్న బిడ్డ ఏలుకోవడానికి కాదు,’ అని హెచ్చరిక చేశారు.

facebook timeline picture

షర్మిలకు తన అన్న జగన్ తో పంచాయితీ ఉంటే అక్కడ చూసుకోవాలి గాని, దానిని తెలంగాణకు తీసుకురా కూడదని ఆయన స్పష్టంగా చెప్పారు.

వైఎస్ బిడ్డగా ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం కానీ, రాజ్యాలు ఏలటానికి  వస్తామంటే కుదరని, అయినా అన్నని కాదని  తెలంగాణ పక్షాన  నిలబడే చిత్తశుద్ధి ఉందా అని  రేవంత్ షర్మిళను ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే…

వైఎస్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారు.  ఇందిరమ్మ పార్టీలోనే వైఎస్ సీఎం అయ్యారు.  వైఎస్ ఏ పథకం తెచ్చినా కాంగ్రెస్ నాయకుడుగా చేశారు
వైఎస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉంది.  అంత మాత్రాన షర్మిల పార్టీ పెడితే ప్రజలు అంగీకరించరు

కేసీఆర్ ఇక సీఎం అయ్యేది లేదు.  కేసీఆర్ దోపిడీ చూసి వంది మీటర్ల గోతిలో పాతి పెట్టడానికి ప్రజలు రెడీ అయ్యారు.  కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణం షర్మిల. పార్టీ ముచ్చట కాదు,ముందు పులిచింతల, పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం పై షర్మిల వైఖరి చెప్పాలి. తెలంగాణ ప్రజల జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్న పోతిరెడ్డి పాడు, సంగమేశ్వరం పై కోర్టులో కేసు వేసి షర్మల తెలంగాణ రావాలి. తెలంగాణ మీద నిజంగా అభిమానం ఉంటే కృష్ణా జలాలపై జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ కేసులు వేసి రావాలి.

షర్మిళ పార్టీ పెడితే తెలంగాణ బిడ్డలు ఊరుకోరు.  తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగాలను అవమానించకండి.  తెలంగాణలో వైఎస్ అభిమానులు స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది.  మన రాష్ట్రం మనం ఏలాలా,  పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి ఏలాలా? వైఎస్ అభిమానులు తేల్చుకోవాలి.

షర్మిల పార్టీకి ఇక్కడ మనుగడ ఉండదు. 1200 మంది బిడ్డల బలిదానాలను అవమానించే వాడే షర్మిలకు స్వాగతం పలుకుతాడు. కేసీఆర్ ఎందుకు ఫాంహౌస్ లో పడుకున్నాడు. షర్మిల పార్టీపై ఎందుకు నోరు మెదపడం లేదు.  కేసీఆర్ వ్యతిరేక ఓట్ల చీలిక తెచ్చేందుకు పార్టీ పెట్టిస్తున్నాడు. సీఆర్ కుట్ర నుంచి తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *