బలవంతపు నామినేషన్ ఉపసంహరణల మీద నిమ్మగడ్డ కొరడా

బలవంతపు విత్ డ్రావల్స్ మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిష న్ దృష్టి పెట్టింది.

ఇపుడు జరగబోతున్న మునిసిపల్ ఎన్నికల్లో  బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. ఇలాగే ఎవో  కానుకలందించి   కొందరిచేత నామినేషన్లను ఉపసంహరింపచేసే విధానం మీద కమిషన్ దృష్టిపెట్టింది.

అయితే, తమ చేత బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించినట్లు ఎవరైనా అభ్యర్థులు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు  చేస్తే, విచారించి, ఆ నామినేషన్లను పునరుద్ధరించేందుకు కమిషన్ నిర్ణయించింది.

ఎటొచ్చి అభ్యర్థులు ముందుకు వచ్చి, తమ చేత బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపచేశారని రాతపూర్వకంగా కమిషన్ ముందుకురావాలి.   ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించాలని ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందని ఫిర్యాదులందుతూ ఉండటంతో మునిసిపల్ ఎన్నికల్లో ఇది పునరావృతం కాకుండా  చర్యలు తీసుకుంటున్నారు.

చాలా చోట్ల బెదిరించి, కొన్నిచోట్ల కానుకలను ఎరగావేసి నామినేషన్లను ఉపసంహరింపచేస్తున్నారని రాజకీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇలాంటి సందర్బాలలో వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు  రాజ్యాంగంలోని  243ZA / 243K అధికరణాల కింద సంక్రమించిన అధికారాలను కమిషన్ వినియోగించుకోవాలనుకుంటున్నది.

బలవంతంగా లేదా ఆశ చూపి ఉపసంహరింపచేసినట్లు ఎవరైనా ఫిర్యాదుచేస్తే వాటిని స్వీకరించి కమిషన్ పంపించాలని  కమిషనర్ మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు,  మునిసిపాలిటీల,నగర పంచాయతీల రిటర్నింగ్ అధికారులకు సూచనలచ్చింది.

12 మునిసిపల్ కార్పొరేషన్లకు, 75 మునిసిపాలిటీలకు, నగరపంచాయతీలకు ఎన్నికల నిర్వహించడం గురించి రెండు రోజుల కిందట ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం నామినేషన్ల విత్ డ్రావల్ మార్చి రెండో తేదీనుంచి మొదలవుతుంది.

ఉత్తర్వులు ఇవే

The Commission is receiving lots of representations/complaints pursuant to the recent judgment of A.P. High Court on 12.02.2021 to check poll aberrations and pointing out the
reservoir of its powers as observed in the said judgment. One specific area is in the case of Municipal elections, the phenomenon of forced withdrawals due to duress and inducements. Where no nominations are filed at all is a different situation.

In light of the above judgment of the Hon’ble High Court, the Commission exercising its plenary powers under Article 243-ZA read with Article 243K of the Constitution of India, has
decided to reconsider de novo where nominations have been filed but where there are unnatural withdrawals due to duress and inducements and the Commission is now inclined to
revive all these withdrawals. If anyone has a reason to state that he/she was compelled to withdraw, his/her nomination will now be revived. However, they have to come forward and
state so. Accordingly, instructions were given to all the Returning Officers of Municipal Corporations and Election Officers of Municipalities / Nagar Panchayats to report to the
Commission all cases where candidates come forward with complaints/representations of coercive and forced withdrawal of candidatures under duress, inducement, etc., immediately to
enable the Commission to take decision on such cases to revive their candidatures.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *