మెడిసిన్ సీటొచ్చింది, ఫీజు కట్టేందుకు సాయం చేయండి…

జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన సి.విక్రం నిరుపేద కుటుంబలో జన్మించాడు. విక్రం తల్లిదండ్రులు కూలీనాలీ చేసి అర్థాకలితో కుటుంబాన్ని నెట్టుకొచ్చినా…తమలా పిల్లలు బాధపడకూడదని బాగా చదువుకునేలా వారిని ప్రోత్సహించాడు. విక్రం 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు చిన్నతాండ్రపాడులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివాడు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ సాంఘీక సంక్షేమ పాఠశాల, మదనాపూర్‌ గ్రామం, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లాలో చదివాడు. ఇంటర్‌మీడియట్‌ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల, గౌలిదొడ్డి, రంగారెడ్డి జిల్లాలో చదివాడు. ఇంటర్‌లో 937 మార్కులు సాధించాడు. నీట్‌లో 430 మార్కులు సాధించి, క్యాటగిరీ ర్యాంక్‌ 9628, ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 152189 సాధించాడు.

నీట్‌ ర్యాంక్‌ ఆధారంగా కన్వినర్‌ కోటాలో కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ వచ్చింది. కళాశాల ఫీజు, హాస్టల్‌ సహా ఇతర ఖర్చులకు ఏటా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అయ్యేలా ఉంది. నిరుపేద కుటుంబం కావడంతో అడ్మిషన్‌ సమయంలో చెల్లించాల్సిన రూ. లక్ష 10 వేలను అప్పులు చేసి చెల్లించాడు. త్వరలో కళాశాలలో తరగతులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో హాస్టల్‌ సహా ఇతర పుస్తకాలు ఇతర ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్‌ అయి ప్రజలకు సేవ చేయాలన్న విక్రం కలలను నిజం చేసేందుకు మీకు వీలైనంత సహాయం చేయాలని కోరుతున్నారు.

విక్రం తండ్రి బ్యాంకు ఖాతా వివరాలు
C.Chinna Raju
Bank: SBI
Acc: 31737565339
IFSc: SBIN0004693
Branch: Ieeja

(కొందరు శ్రేయోభిలాషుల అభ్యర్థన మేరకు ముద్రించాం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *