పెద్దిరెడ్డి ఎఫెక్ట్, ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ బాసట

ముఖ్యమంత్రి జగన్  కు మేలు చేస్తున్నారో హాని చేస్తున్నారో తెలియదుగాని రాష్ట్రమంత్రులు, సలహాదారులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద అభ్యంతరకరమయిన భాషలో దాడి చేస్తూ అభాసు పాలవుతున్నారు. తాజా ఉదాహరణ పంచాయతీ రాజ్ మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి.

ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ కు మేలు చేసినట్లయితే కాదు. ఎన్నికల  కమిషన్ మీద దాడి మొదలు పెట్టిన్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వైసిపి మీద సానుభూతి పెంచే పరిణామం జరగలేదు. ప్రతి మలుపులో ఎన్నికల కమిషన్ అజేయంగా నిలబడుతూ వస్తూ వుంది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కోర్టు తీర్పులతో మరింత బలపడుతున్నారు. ఆయన చుట్టూ కోర్టు తీర్పులు దుర్భేధ్యమయిన రాజ్యాంగ రక్షణ కవచం నిర్మించాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే గెలుపొందిన రాజ్యంగ సంస్థలకే కాదు, ఎన్నికలతో సంబంధం లేకుండా ఏర్పాటయిన రాజ్యాంగ సంస్థలకు కూడ సమానమయి  రాజ్యాంగ రక్షణ బాధ్యతలున్నాయి. అలాంటి  సంస్థలలో ఎన్నికల కమిషన్, గవర్నర్ వంటి వాళ్లు ఉంటారు. ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థల ను దెబ్బతీయడం అంతసులభంకాదు, ఎన్నికల్లో ఎంతమెజారిటీ వచ్చినా ఈ వ్యవస్థలను గౌరవించకతప్పదని రాష్ట్రంలో ఇపుడు జరుగుతున్న వివాదం చెబుతుంది.

రాష్ట్రపంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి లాంటి వాళ్లు చేసిన హెచ్చరికలను, బెదిరింపులను పట్టించుకోనవసరం లేదని ఈ రోజు  ఎస్ ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటర్నింగ్ అధికారులకు అభయమిచ్చారు.ఎన్నికల విధుల్లో ఉన్నవాళ్లందరికి కమిషన్ బాసటా ఉందని ఒక ప్రకటన ఇచ్చారు.  రామచంద్రారెడ్డి పేరు ప్రస్తావించలేదుగాని, వ్యక్తి ఎంతపద్ద వాడైనా  తాత్కాలికమే, వ్యవస్తే శాశ్వతమని అన్నారు. ఈ రోజు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదలచేసిన ప్రకటన ఇది.

ప్రకటన

విధి నిర్వహణలలో ఉన్న అధికారులు , ముఖ్యంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రిటర్నింగ్ అధికారులు ఎటువంటి అభద్రతా భావనకు గురికావలసిన అవసరం లేదు.

నియమావళికి అనుగుణంగా చట్ట ప్రకారం బాధ్యలు నిర్వహించే ఉద్యోగులుకు రాజ్యాంగం పూర్తి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగటా ఎన్నికల విధులలో ఉన్న అధికారులు ఎన్నికల కమిషన్  రక్షణ కవచంలో ఉంటారు.

ఎన్నికల విధులలో ఉన్న అధికారులపై  ఎటువంటి క్రమశిక్షణ చెపట్టాలన్న ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతి విధిగా  తీసుకోవాలని, ఇప్పటికే మాన్య సుప్రీంకోర్టు సూచన ప్రకారం ఎన్నికల సంఘం విష్సష్టమయిన ఆదేశాలను ఇచ్చింది.

ఇదే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల విధులలో ఉన్న అధికారులై ముందస్తు అనుమతి లేకుండా చర్యలను నిషేధిస్తూ ఉత్తర్వులు త్వరలో జారీ చేయనుంది.

ఎన్నికల విధులలో ఉన్న అధికారులు, బెదిరింపు ప్రకటనలను ఎంతటి  పెద్దవారు ఇచ్చినా లెక్క పెట్టనవసరం లేదు. భయబ్రాంతులకు లోనవవలసిని అవసరం లేదు.

అటువంటి ప్రయత్నాలు చట్టరీత్యా చెలుబడి కావు. వాంఛనీయం కావు. ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతుకుల గురి చేసే ప్రయత్నాలు అనైతికమని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృఢంగా విశ్వసిస్తుంది.

ఇప్పటికే ఉద్యోగులను అస్థిరపరిచే చర్యలను చక్కదిద్దటానికి ప్రయత్నాలు చేశాము. దుందుడుకు చర్యలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదు.

ఎలక్షన్ కమిషన్  ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిని రాజ్యాంగ సంస్థ. ఎన్నికలు జరపడం రాజ్యాంగ బాధ్యత.ఇది కమిషన్, రాజ్యాంగ వ్యవస్థల సమబాధ్యత. ఈ ప్రక్రియకు మాన్య గవర్నర్  రక్షకులు. రాజ్యాంగం ప్రత్యేకించి ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులకు విశేష రక్షణ కల్పించింది.

విధులలో అందరూ క్రియాశీలంగా, నైతికతతో నిబద్ధతతో రాజ్యాంగ స్ఫూర్తితో విధులు నిర్వహించాలి. దానికి ఎన్నికల కమిషన్ రక్షణ ఎల్లపుడూ ఉంటుంది. వ్యక్తులు ఎవరైనా తాత్కాలికమే, వ్యవస్థలే శాశ్వతం. అన్ని నిజాన్రని గుర్తించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *