తెలంగాణలో యూనివర్శిటీలన్నీ తల లేని మొండేల్లాగా తయారయ్యాయని ఎఐసిసి ప్రతినిధి ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజు వర్ణించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాలకు వెంటనే వైస్ చాన్స్ లర్లను నియమించాలని గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ లేఖ రాయడాన్ని ఆయన స్వాగతించారు. చివరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ‘ఫామ్ హౌస్ పాలన’లో విసిలను నియమించండని గవర్నర్ గుర్తుచేయాల్సి వస్తున్నదని దాసోజు విమర్శించారు.
దీనికి కారణం, ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్ సాగు మీద ఉన్న ఆసక్తి విశ్వవిద్యాలయాల మీద, విద్య మీద లేకపోవడమేనని దాసోజు విమర్శించారు.
రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్ లర్లను నియమించక పోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విసిలు లేక తల లేని మొండెం లాగా యూనివర్శిటీలు తయారయ్యాయని అన్నారు. మరొక వైపు విశ్వవిద్యాలయాలకు నిధులీయడం లేదు. ఇంకొక వైపు నుంచి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అనుమతిస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ లో ఉన్న ఉన్నత విద్య కూలి పోతున్నదని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి శ్రవణ్ దాసోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో మరిన్ని వివరాలు: