జగనన్న ఆర్థిక శాఖ ఇంత అధ్వాన్నమా?

నెలలు దాటినా ఆర్ధిక శాఖ నుండి చేతికందని  పెన్షనర్ల,ఉద్యోగుల డబ్బులు

 రిటైర్మెంట్ రోజునే ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్..ప్రభుత్వ ఉత్తర్వులకు తిలోదకాలు పల్కిన ఆర్ధిక శాఖ…

జబ్బున పడిన ఎంప్లాయిస్ హెల్త్ కార్డులు
….

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ (రిటైర్మెంట్ బెనిఫిట్స్) విరమణ రోజునే వారికి రావాలిసిన డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ అవసరాల నిమిత్తం వారు దాచుకున్న (జిపిఎఫ్ నుండి) డబ్బులు, (లోన్స్), ఉద్యోగుల, పోలీసుల సరెండర్ లీవ్స్ బిల్లులు నెలల తరబడి ఆర్ధిక శాఖలో పేరుకుపోయి ఉండటం పట్ల  ఆంధ్రప్రదేశ్ ఉద్యోగల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ బిల్లులన్నీ  ఆర్ధిక శాఖ కార్యదర్శి  ఆమోదం కొరకు ఎదురు చూస్తున్నాయి.   కొంతమంది ఉద్యోగులు వారి కూతురు/కుమారుని వివాహానికి వివాహాలకు  అపు  చేసి, దానికి వడ్డీలు చెల్లించలేక తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారుని AP JAC అమరావతి రాష్ట్ర కార్యవర్గం పేర్కొంది.

మరికొంతమంది సకాలంలో బిల్లులు చెల్లింపు కాక ఇటీవల వారి ఇంట్లో శుభకార్యాలు కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని రా ష్ట్ర కార్యవర్గం పేర్కొంది.

ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులదే  AP JAC అమరావతి నిర్ద్వంద్వంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక తీర్మానం చేసింది.

ఆర్థిక శాఖ చర్యలను AP JAC అమరావతి రాష్ట్ర కార్యవర్గం తీవ్ర అసంతృప్తి తెలియచేస్తూ తేదీ 27.1.2021న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా  తీర్మానంఆమోదించారు.

రాష్ట్ర కార్యవర్గం చేసిన మరికొన్ని తీర్మానాలు:

● తక్షణమే ఆర్ధిక శాఖలో పెండింగులో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన అన్ని బిల్లులను తక్షణమే ఆమోదించాలి. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే వారికి రావాలిసిన బెనిఫిట్స్ అన్నీ అదేరోజున ఇచ్చే విధంగా తక్షణమే ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించాలి.  అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ అవసరాల నిమిత్తం వారు దాచుకున్న జిపిఎఫ్ లోన్స్, ఉద్యోగుల, పోలీసుల సరెండర్ లీవ్స్ చెల్లింపులు తదితర బిల్లులన్నియు ఎప్పటికప్పుడు బిల్లులు ఆర్ధిక శాఖతో సంబంధం లేకుండా CFMS నుండే డైరెక్ట్ గా వారి వారి అకౌంట్ కు చేరే విధంగా తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాలి

ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్స్:

● రాష్ట్రంలో గత 7 సంవత్సరాల క్రితం దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎంప్లాయి హెల్త్ కార్డ్ ఈ రోజుకు కూడా పూర్తిగా వినియోగంలోకి రాకపోగా, 7 మంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మారినా ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. దీనికోసం  కోసం ఏర్పాటు చేయబడ్డ స్టీరింగ్ కమిటీ సమావేశం ఈ రోజుకు కూడా జరుగ లేదు.

● ప్రతినెలా ఉద్యోగుల శాలరీ నుండి EHS కు సబ్ స్క్రిప్షన్ రికవరీ అవుతున్నా ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందటం లేదు.ఆరోగ్య ఇబ్బందులతో వైద్యం కోసం వెళ్లే వారికి రెఫరల్ హాస్పిటల్స్ నందు సరైన రెస్పాన్స్ ఉండటం లేదు. ఆఖరికి ఉద్యోగసంఘాల నాయకులు తమ ఉద్యోగులకు ఈ Unhealthy card వద్దు.

●  తక్షణమే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  వారి ఆధ్వర్యంలో EHS స్కీం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించాలని, లేదంటే వెంటనే EHS రికవరి నెల వారి చందాను నిలుపుదల చేసి, ఉద్యోగులకు, పెన్షనర్లకు మెడికల్ రేయింబర్సుమెంట్ కింద ప్రస్తుతం ఉన్న 2 లక్షల రూపాయల లిమిట్ ను 5 లక్షల రూపాయలకు పెంచాలని కోరారు.

పైన తెలిపిన ప్రధానమైన రెండు తీర్మానాలను మెమొరాండం రూపంలో తయారు చేసి నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ వైవీ రావులు సమర్పించగా, వారు పై విషయాలపై చాలా సానుకూలంగా స్పందిస్తూ, ఎన్నికల కోడ్ ఉన్నందున సదరు విషయమై ఒక్కసారి పరిశీలించి వీలైనంత త్వరగా ఆర్ధిక శాఖ అధికారులతో మరియు వైద్య శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పై రెండు ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

(  AP JAC Amaravati నేతలు  బొప్పరాజు & వైవీ రావు విడుదల చేసిన ప్రకటన)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *