ఒక శాంతి దూత ఇలా పతనమయ్యారు…

మయన్మార్ నాయకురాలు ఆవుంగ్ సాన్ సూచీ (Aung San Suu Kyi)కి ఎదురయిన పరిస్థితి ప్రపంచంలో ఎవరికీ ఎదురయి ఉండదు.  మళ్లీ ఫిబ్రవరి ఒకటో తేదీన  ఆమె మీద మిలిటరీ (Tatmadaw) తిరుగుబాటు చేసింది. అరెస్టు చేసింది.
కొత్తగా ఎన్నికైన పార్లమెంటు నిన్న సోమ వారం నాడు సమావేశం కావలసి ఉండింది.
ఈ సమావేశానికి  ముందే సైన్యం తిరుగుబాటు చేసి దొంగాట అడుకున్నంత సుళువుగా దేశాధ్యకుడు విన్ మైయింట్ (Win Myint) ని, ప్రభుత్వ సలహాదారు సూచీని, ఇతర సీనియర్ మంత్రులను, రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను అరెస్టు చేసి పడేసి అధికారం చేజిక్కించుకుంది.
సూచీకి విదేశీ పౌరులైన కుమారులున్నందున ఆమె దేశంలో ఎలాంటి పదవి చేపట్టడానికి వీల్లేదు. కాకపోతే,ఆమె ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటున్నారు. ఇలా సలహాదారుగా ఉంటూ పరోక్షంగా అధికారం నడిపిస్తున్నారు.
 అయిదేళ్ల కిందటే మిలిటరీ పరిపాలన పోయి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది. అంతలోనే  ఈ ప్రభుత్వమూ కూలిపోయింది. అయితే, సూచీని అరెస్టు చేసి మిలిటరీ అధికారం చేజిక్కించుకన్నా ప్రపంచం లో పెద్దగా నిరసన రాలేదు. రోటీన్ దేశాలు తిరుగుబాటు ను ఖండించాయి.  అమెరికా మయన్మార్ అనకుండా బర్మా అంటూ తిరుగుబాటు ను ఖండించి ప్రజాస్వామిక విధానాలు కొనసాగాలని అంది. ఒకనాడు శాంతి దూతగా వేనొళ్ల కీర్తించబడిన సూచీ ఇపుడు మళ్లీ బందీ అయ్యారు. ఈ సారి శాంతి కోసం, ప్రజాస్వామ్యం కోసం కాదు,  శాంతి భగ్నపరిచే కార్యక్రమాలను ప్రోత్సహించినందుకు,సైన్యానికి వత్తాసుపలికినందుకు.
ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీతను అరెస్టు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకపుడు సూచీ ప్రజాస్వామ్య పోరాటానికి ప్రతీక, భారత్ తో సహా ప్రపంచమంతా ఆమెకు సహకరించింది. ఆమెకు ప్రపంచ నేత హోదా నిచ్చింది. శాంతి దూత అన్నారు. మిలిటరీ ఆమెను 1989-2010 దాకా అంటే 15 సంవత్సరాలు  గృహ నిర్బంధంలో ఉంచింది.  ఆమె ప్రజాస్వామిక పోరాటానికి ఆమె ప్రతీక అయ్యారు. దీనికి గుర్తింపుగా1991లో  ఆమె నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
అయితే ఎన్నికల్లో ఆమె పార్టీ గెలుపొందాక ఆమె విధానాలు పట్ల ప్రపంచం విస్తుపోయింది. దేశంలో ముస్లింల వూచకోతను ఆమె సమర్థించింది. దీని మీద అంతర్జాతీయ న్యాయస్థానం చేస్తున్న విచారణలో వూచకోతను దాదాపు సమర్థించారు. ప్రపంచం ఆమెకు దూరమయింది.
ఆమె దేశంలో ప్రజల మధ్య సామరస్యం తీసుకురావడానికి బదులు వైషమ్యాలు రెచ్చగొట్టింది.  ప్రజలలో ఆమె పట్టు రాలేదు. అలాగనీ మిలటరీని అదుపు చేయలేకపోయారు. అందుకే, ఈ మధ్య జరిగిన ఎన్నికలు బోగస్ అని మిలిటరీ ప్రకటించింది. కొత్తగా ఏర్పడిన పార్లమెంటు సమావేశం కాకముందే తిరుగుబాటు అందరినీ అరెస్టు అధికారం చేజిక్కించుకుంది. ఒక అయిదేళ్లు మినహాయించి మయన్మార్ ల అయిదు దశాబ్దాలుగా మిలిటరీ  పాలనే సాగుతూఉండింది. ఇపుడు మళ్లీ కమాండర్ ఇన్ చీఫ్  సీనియర్ జనరల్ మిన్ అవుంగ్ హ్లైయింగ్ (Min Aung Hlaing) తిరుగుబాటు చేశాడు. సోమవారం  నాడు బర్మా టివి జనరల్ మింగ్ మిలిటరీ దేశాధినేత అని ప్రకటించింది. దేశంలో ఒక ఏడాది ఎమర్జన్సీ విధించారు.
 దేశంలో ఎక్కడా నిరసన హింస చెలరేగలేదు. రాజధాని నే ప్యి తా (Nay Pyi Taw) మరొక ప్రధాన నగరం యాంగన్ మిలటరీ అదుపులో ఉన్నాయి. ఇంటర్నెట్ బంద్ చేశారు.
రేడియోస్టేషన్లు, టివి స్టేషన్లు మూతపడ్డాయి. 24  మంది క్యాబినెట్ మంత్రులను తీసేశారు.  11  మంది కొత్తవారి ని నియమించారు. దేశమంతా రాత్రి కర్ఫ్యూ విధించారు.
మొన్న నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో సూచీ పార్టీ NLD మంచి మెజారిటీ తెచ్చుకుంది.  2015లో వచ్చిన దానికంటే ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంది. కోవిడ్ నియమాలను కూడా లెక్క చేయకుండా 70 శాతం ప్రజలు NLD (National League for Democracy) కి వోటు చేశారు. మిలిటరీ మద్దతుతో పోటీ చేసిన USDP (Union Solidarity and Development Party) దారుణంగా ఓడిపోయింది. దీనితో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి ప్రతిపక్ష పార్టీ అరోపించింది. మళ్లీ ఎన్నికలు జరపాలనింది. దీనిని మిలటరీ సమర్థించింది. ఈ వివాదమే మిలిటరీ తిరుగుబాటు దాకా వచ్చింది. ఇపుడు ఎన్నికల అక్రమాల మీద సైన్యం విచారణ జరుపుతుందట.
ఈ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీతో సూచీ రాజ్యంగ సవరణ చేసి మిలిటరీ అధికారలను కత్తిరించే ప్రమాదం ఉంది. ఇపుడు జనరల్ మిన్ కు పార్లమెంటులో 25 శాతం మంది ఎంపిలున్నారు. క్యాబినెట్ లో సెక్యూరిటీ కి సంబంధించిన శాఖలన్నీ మిలిటరీ ప్రతినిధులే. ఈ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరిగితే జనరల్ మిన్ ఉద్యోగమే పోవచ్చు. అందువల్ల అతగాడు రాత్రికిరాత్రే తిరుగుబాటు చేశాడు.
తమాషా ఏంటంటే, మైనారిటీ ప్రజలను సైన్యం ఊచకోత కోస్తున్నపుడు (2016,2017) ఆమె సమర్థించారు.  ఏ జనరల్స్ కి తానా తందానా అన్నారో, ఎవరి అకృత్యాలను, హింసాకాండను వెనకేసుకు వచ్చారో వాళ్లే ఇపుడు తిరుగుబాటు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *