ఆంధప్రదేశ్ ఉద్యోగ సంఘాల సమాఖ్య నేత కాకర్ల వెంకట్రామిరెడ్డి ఇపుడు రాష్ట్రంలో టాకింగ్ పాయింట్ అయ్యారు. ఆయన పంచాయతీ ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇచ్చారు.పంచాయతీ ఎన్నికలు జరపండి అని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎన్నికల కమిషన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మిలిటెంట్ నాయకుడని వైసిపి నేతలు ప్రశంసిస్తున్నారు. ఎన్నికలకు సహకరంచేది లేదని కరాఖండిగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో బాగా రాజకీయ పలుకుబడి ఉన్న నాయకుడని ఆయన గురించి ఉద్యోగులు చెబుతారు. ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే టాక్ ఉంది పాలిటిక్ సర్కిల్స్ లో.
ఈ మధ్య ఉద్యోగ సంఘాల ఉద్యమాలు నడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావడం, కొండకచో మంత్రి పదవులు చేపట్టడం ఒక కొత్త ట్రెండ్. దీనికి తెలంగాణ ఉద్యమం బాట వేసింది. ఈ స్ఫూర్తితో ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ నాయకులు అవుతున్నారు. వాళ్లు కూడా అధికారం అందలమెక్కడానికి ఇదొక షార్ట్ కట్ మార్గమని భావిస్తున్నారు. అందుకే మధ్య ఉద్యోగుల సంఘాల నాయకులు రాజకీయాల్లో బాగా మునిగితేలుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకత్వం ఇపుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పరమపద సోపానమయింది. అక్కడి నుంచి మంత్రి పదవులు చేపట్టవచ్చు.
తెలంగాణ ఉద్యమానికి ముందు కొంతమంది టీచర్ల సంఘాల నేతలు ఎమ్మెల్సీలు అయ్యేవారు. వాళ్లొకొక కౌన్సిల్ నియోజకవర్గం ఉండేది. వాళ్లంతా ఉద్యోగుల ఉన్నతికి కట్టుబడిన వాళ్లు, మేధావులు కూడా. రాజకీయ పార్టీలతో అంతగా తిరిగే వారు కాదు. సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవారు. ఆరోజుల్లో ఇతర ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయంగా ఎదగ లేకపోయారు. కాకపోతే, సంఘాలకు నాయకత్వం వహించి అపుడపుడు హక్కుల కోసం ఎన్జీవోల సమ్మె జరిపి ప్రభుత్వంలో మాంచి పలుకుబడి సంపాయించే వాళ్లు.
తెలంగాణ ఉద్యమం తర్వాత పరిస్థితుల బాగా మెరుగుపడ్దాయి. ఉద్యోగుల సంఘాల నేతలకు పార్టీలు మంచి హోదాను ఇస్తున్నాయి. తెలంగాణలో ఉద్యోగుల సంఘం ఒక నేత వి. శ్రీనివాస్ గౌడ్ టిఆర్ ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. ఆయన ఇపుడు కెసిఆర్ క్యాబినెట్ లో ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా. మరొక ఎన్జీవో నాయకుడు స్వామిగౌడ్ ఎమ్మెల్సీ అయి, కౌన్సిల్ చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు కెసిఆర్ మరొక అవకాశమీయక పోవడంతో ఇపుడు బిజెపిలో చేరారు.
ఇంక ఆంధ్ర ఎన్టీవొ నాయకుడు, సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నాయకుడు ఆశోక్ బాబు. ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గిర వాడు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రకారం ఆయన సమైక్యాంధ్ర ఉద్యమానికి ఉద్యోగులను సమీకరించేవాడని ఆ రోజు విమర్శ ఉండేది. రాష్ట్ర విభజన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన టిడిపిలో చేరిపోయారు. ఎమ్మెల్సీ అయ్యారు.
ఇపుడు వైసిపి అధికారంలోకి వచ్చాక రెండు పేర్లు బాగా వినపడుతున్నాయి. ఇందులో ఎన్జీవో సంఘం నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఒకటి కాగా, రెండో పేరు ప్రభుత్యోద్యోగ సంఘాల సమాఖ్య నాయకుడు వెంకట్రామిరెడ్డి. వీరిద్దరు ఇపుడు బాగా పలుకుబడి ఉన్న నేతలు. వీరద్దరు తొందర్లో రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చాలా మంది భావిస్తున్నారు. ఇందులో కూడా వెంకట్రామిరెడ్డి బాగా ముందున్నారని చాలా మంది చెబుతున్నారు.
ఈ వెంకట్రామిరెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ నాటుబాంబుల సుధాకర్ రెడ్డి ఏమంటున్నారో వినండి.
వెంకట్రామిరెడ్డి భార్య, శ్వేతా వెంకటరామి రెడ్డి, ఫక్కా వైసిపి కార్యకర్తల
ఆమె 2012 నుంచి ముషీరాబాద్ నియోజకవర్గంలో వైసీపీ తరుపున పని చేస్తున్నారు
– ముషీరాబాద్ నియోజకవర్గంలో 2014లో వెంకట్రామిరెడ్డికి కూడా జగన్ ఎమ్మెల్యే
ఇచ్చారు,కానీ నామినేషన్ సమయానికి, ప్రభుత్వ ఉద్యోగి అని బయటపడటంతో, నామినేషన్ వెయ్యటానికి వీలు పడలేదు…
– దీంతో వెంకట్రామిరెడ్డి భార్య, శ్వేతా వెంకటరామి రెడ్డి, వైసీపీ తరుపున ప్రచారం చేశారు.
– 2014 ఎన్నికల్లో చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆయన సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు.
– ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, చంద్రబాబుని ఓడించి, జగన్ ని గెలిపించాలని బహిరంగంగా చెప్పాడు
– చంద్రబాబు అధికారంలోకి రావటంతో, 2013 డిసెంబర్ నుంచి 2015 వరకు పెట్టిన పోస్టులు అన్నీ డిలీట్ చేసారు…
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, కాకర్ల వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష పదవిలోకి వచ్చారు. 40 ఏళ్ళ వయసులోనే ఆ పదవిలోకి రావడం వెనుక జగన్ ఆశీస్సులు ఉన్నాయి…అని టిిడిపి నేత సుధాకర్ రెడ్డి అన్నారు.