రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్ల జగన్ ధోరణి బాగ లేదు: బిజెపి, జనసేన

ఆంధప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్ల ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు గర్హించాయి. ఈ పరిస్థితి గురించి బిజెపి హైకమాండ్ దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ రెండు పార్టీల నేతలు గత రాత్రి సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులను, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు, తిరుపతిలోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయం చర్చించారు. కమిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన విషయం ప్రస్తావిస్తూ “ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పరిస్థితులు చూడలేదు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం రాష్ట్రప్రభుత్వ విధి.  అలా గౌరవించని పక్షంలో  ప్రజాస్వామ్యంపై ప్రజలలో నమ్మకం పోయే ప్రమాదం ఉంది.”అని సమావేశం అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఎదురువుతన్న ఈ పరిణామాన్ని  బిజెపి అగ్రనాయకుల దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశం నిర్ణయించింది.

తిరుపతి లోక్సభ స్థానానికి త్వరలో జరుగనున్న ఉప ఎన్నికకు సంబంధించి చర్చించినా ఎవరు పోటీ చేయాలి,అభ్యర్థి ఎవరనేది తేలలేదు. కాకపోతే, ఎన్నికల ప్రచారానికి కేంద్రనేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇప్పటినుంచి ఉప ఎన్నికలకు రెండు పార్టీల శ్రేణులను సమాయత్తం చేయాలని కూడా ఇరుపార్టీలు నిర్ణయించాయి. రెండు పార్టీ లనుంచి ఆశావహుల జాబితా తయారుచేసి  గెలిచే అభ్యర్థిక ఎంపిక చేయాలని  మూడుగంటల పాటు

హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశం నిర్ణయించారు.

సమావేశంలో  జనసేన తరఫున పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి అద్యక్షుడు సోము వీర్రాజు, బిజెపి ఎంపి వ్యవహారాల ఇన్ చార్జ్,కేంద్రమంత్రి మురళీ ధరన్,  జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి,  ఎపి బిజెపి సహాయ  ఇన్ చార్జ్ సునీల్ దేవ్ ధర్ పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *