రాష్ట్రంలో ఆలయాల మీద దాడులు వెనక రహస్యం ఇదే…

(అంపావతిని గోవిందు)

కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు. కనుక వాటిని రద్దు పరచాలని ఢిల్లీలో 45రోజులుగా ఎముకల్ని కొరికే చలిలో,వర్షంలో లక్షలాది మంది రైతులు ఉద్యమాలు చేస్తున్నారు.

ఈ ఉద్యమంలో దాదాపు 30మందికిపైగా రైతులు చనిపోయారు. ఆ ఉద్యమం మరింత ఉధృతమై మన రాష్ట్ర రైతుల్లో వస్తుందనే భయంతో ఇక్కడ ఉన్న కుల,మత పార్టీలైన వైసీపీ,టీడీపీ, బిజెపి,జనసేనలు కూడ పల్కొని ప్రజల మత సెంటిమెంటును రాజేసి,రాష్ట్రాన్ని రావణ కాష్టలా చేస్తున్నాయి.

ఇలా ఎందుకు చేస్తున్నాయంటే…

బిజెపి ప్రభుత్వం ఈ వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రెండు కూడా తన ఎంపీలకు మరి విప్పు జారీచేసి ఓట్లు వేయించినాయి.

ఇప్పుడు ఆ రైతు ఉద్యమం మరింత బలపడి మన రాష్ట్ర రైతుల్లో వస్తే ఈ పార్టీల మనుగడ ప్రశ్నార్ధకమౌతుంది.

అందువలన కేంద్రంలో రాసుకు పూసుకొన్న ఈ పార్టీలు ఇక్కడ బద్ద శత్రువుల్లా వ్యవహరిస్తూ ప్రజలను పచ్చిగా మోసం చేస్తూ,తమ స్వార్థం కోసం ప్రజల్లో లేని సెంటిమెంటును ఈ పార్టీ(వైసీపీ,టీడీపీ,బిజెపి,జనసేన)లు కూడ పల్కొనే రాజేస్తున్నాయి.

ఇక్కడ అధికార వైసీపీ ప్రభుత్వం వెంటనే దేవతా విగ్రహాలను దెబ్బతీసిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించి, ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చేసి ఉండాలి.

అలాగే ప్రతిపక్షాలు కూడా సమస్యను పెద్దది చేయకుండా సహకరించాల్సి ఉంది.కాని అలాచేయకుండా గోటితో పోయేదానికి గొడ్డలిని ఉపయోగించిన చందంగా తమ స్వార్ధ రాజకీయాల కోసం నానా యాగి చేసి ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయి.ఈ కుల,మత పార్టీల దుర్మార్గమైన దుర్భిద్దిని ప్రజలు నిత్యము గమనిస్తున్నారనే విషయాన్ని మరిచి పోవద్దని హెచ్చరిస్తున్నాము.

ఇక్కడ గుళ్ళు, గోపురాలు, రథాలను దెబ్బ తీసిన నీచులను వెంటనే కఠినంగా శిక్షించాలని మా తరుపున మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాం.పైగా అవి (గుళ్ళు,గోపురాలు, రథాలు) ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండాలని కూడా కోరుకొంటున్నాం.

అయితే ఈ కుల, మత పార్టీలు గుళ్ళు, గోపురాలు, రథాలకు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం సూది మోనంత కూడా బహుజన ఆడబిడ్డలను అత్యాచారాలు చేసి,హత్యలు చేస్తే స్పందించలేదు. కనుక ఈ కుల, మత పార్టీల దుర్మార్గాలను బహుజనులు అందరూ గమనించి చైతన్యవంతులు కావాలని మనవి చేస్తూ,ప్రజల మనోభావాలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ కుల, మత పార్టీలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం అది మీకే మంచిది కాదని తెలియచేస్తున్నాం.

(9.1.2020న అనంతపురం జిల్లా, కదిరిలో “ఆంధ్ర బహుజన ప్రజావేదిక”ఆధ్వర్యంలో నిర్వహించిన  ప్రెస్ మీట్ లో రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు చెప్పిన విశేషాలు)

విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు,కదిరి నియోజకవర్గం కన్వీనర్ వై.ప్రసాద్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ఆర్.హరిప్రసాద్, ఎస్.లక్ష్మన్న, కదిరి టౌన్ కమిటీ కన్వీనర్ కెజిఎన్.జిలాన్ (వెల్డర్స్ యూనియన్ నాయకులు) వేంకటేశ్వరగౌడ్,కదిరి టౌన్ కమిటీ కో-కన్వీనర్లు డేరంగుల భాస్కర్, చారుపల్లి ఆంజనేయులు, కుటాగుళ్ళు రామన్న, పాపన్న,రామచంద్ర, నరసింహులు, ఇస్మాయిల్, శంకర,బాలాజీనాయక్, గంగయ్య, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *