ఉద్యోగుల నేతలా, రాజకీయ రాజకీయ నాయకులా?

(కళా వెంకట్రావు)

రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్  ఎస్ఈసీ కమీషన్ పై వైకాపా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.

కమిషన్ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ మంత్రుల స్థాయిని తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్దం.

వైసీపీ నాయకులకు, కోర్టులు, న్యాయమూర్తులు, రాజ్యాంగ బద్దమైన సంస్థలంటే లెక్కలేకుండా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.

వైసీపీ దుర్బుద్దిని ఉద్యోగ సంఘాలకు ఆపాదిస్తున్నారు. వైసీపీ నాయకులు ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారు?  అంత ప్రజాబలం ఉందని చెప్పుకుంటున్న జగన్  ఎన్నికంటే ఎందుకు వణుకుతున్నారు?

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం నుంచి తాడేపల్లి ప్యాలెస్ పునాదుల్లో కదలిక ఎందుకు మొదలయ్యింది? జగన్ నియంతృత్వ పోకడలను ప్రజలు చెప్పులతో కొట్టి పిడకల దండలు వేసే రోజులు దగ్గరపడ్డాయని మీ ఆందోళనతో అర్ధమవుతుంది.

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి ఏనాడు మాట్లాడని ఉద్యోగుల సంఘం నేడు పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘమే సుప్రీమని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయం మరిచారా?  ఉద్యోగుల సంఘం జగన్ తరుపు వత్తాసు తీసుకొని మాట్లాడుతున్నారు గాని ప్రభుత్వ ఉద్యోగుల తరుపున మాట్లాడటం లేదని నేడు ఉద్యోగులే భావిస్తున్నారు.

(కళా వెంకట్రావు, పొలిట్ బ్యూరో సభ్యులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *